Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు ఈ జ్యూస్ తాగితే కంటి చూపు పెరగటమే కాకుండా కంటి నరాలు బలంగా ఉంటాయి

Eyesight increase home remedies : ఈ రోజుల్లో ఎక్కువగా టీవి చూడటం,ఫోన్ తో సమయాన్ని ఎక్కువగా గడపటం, కంప్యూటర్ ముందు ఎక్కువగా వర్క్ చేయటం వంటి అనేక రకాల కారణాలతో కంటికి సంబందించిన సమస్యలు ఎన్నో వస్తున్నాయి. కంటిలో శుక్లాలు, కళ్ల మంటలు,దురద వంటి సమస్యలను తగ్గించటానికి ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం.

గ్రీన్ ఆపిల్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలాగే ఒక క్యారెట్ ని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత చిన్న బీట్ రూట్ ని తీసుకొని శుభ్రం కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్ లో క్యారెట్ ముక్కలు,ఆపిల్ ముక్కలు,బీట్ రూట్ ముక్కలు వేయాలి.

ఆ తర్వాత రెండు స్పూన్ల గుమ్మడి గింజలు, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక గ్లాసు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ జ్యూస్ ని వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిది. కంటికి సంబందించిన సమస్యలు తగ్గటమే కాకుండా జ్ఞాపకశక్తి సమస్యలు కూడా ఏమి లేకుండా చేస్తుంది.
carrot beetroot juice
ఈ జ్యూస్ తాగటం వలన వయస్సు పెరిగే కొద్ది వచ్చే కంటి సమస్యలు రావు. అలాగే కంటి నరాలు బలహీనంగా లేకుండా బలంగా ఉంటాయి. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉదయం సమయంలో తాగితే అలసట,నీరసం లేకుండా హుషారుగా ఉంటారు. కాబట్టి ఈ జ్యూస్ ని తాగటానికి ప్రయత్నం చేయండి.
gummadi ginjalu benefits in telugu
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.