Healthhealth tips in telugu

సెలబ్రిటీలు తాగే బ్లాక్‌ వాటర్‌ ఎప్పుడైనా తాగారా…స్పెషల్‌ ఏమిటో తెలుసా…?

Black water Benefits In telugu : Black Water లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఈ నీటిని తాగుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్పుతున్నారు. బ్లాక్ వాటర్ ఆన్‌లైన్‌లో 500ఎంఎల్ దాదాపుగా 100 రూపాయిలు ఉంటుంది.
Black water
Black Water లో ఉన్న ప్రత్యేకతలు మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సాదారణ నీటి కంటే ఈ నీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. వ్యాయామం చేసిన తర్వాత చెమట ద్వారా నీరు అధికంగా బయటకు పోతుంది. ఆ నీటిని వెంటనే భర్తీ చేస్తుంది. Black Water ఎంత ఆరోగ్యకరం అనేది శరీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
Benefits Of Drinking Water Empty stomach
సాదారణ నీటితో పోలిస్తే Black Water అధిక pH స్థాయి కారణంగా కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అయితే Black Water ఎక్కువగా తాగకూడదు. లిమిట్ గా మాత్రమే తాగాలి. Black Water శరీరాన్ని సాధారణ నీటి కంటే ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంచుతుంది. దీని pH స్థాయి సాధారణ నీటి కంటే 8 నుండి 8.5 వరకు ఉంటుంది. Black Water మంచి డిటాక్స్ డ్రింక్ గా పనిచేస్తుంది.
gas troble home remedies
ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే జీవక్రియ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయ పడుతుంది. బ్లాక్‌ వాటర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపించడంలో సమర్థంగా పని చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు.

లీట‌ర్ బ్లాక్ వాట‌ర్‌లో 70 మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవి జీర్ణ‌శ‌క్తిని పెంపొందిస్తాయి. ఈ వాటర్‌ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. అలాగే అసిడిటీ ప్రాబ్లెం రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. Black Water ని ఎక్కువగా తాగితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
kidney problems
Black Water ని కిడ్నీ సమస్యలు ఉన్నవారు తాగకూడదు. శరీరంలో ఆల్కలైన్ స్థాయులు పెరిగిపోవడం వల్ల గ్యాస్-ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. అధిక pH మీ చర్మాన్ని పొడిగా మారుస్తుంది. Black Water తాగే ముందు వైధ్య నిపుణున్ని సంప్రదించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.