పసుపు,తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Turmeric And honey : పసుపు,తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక స్పూన్ తేనెలో పావు స్పూన్ లో సగం పసుపు వేసి బాగా కలిపి వారంలో మూడు సార్లు తీసుకుంటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
పసుపు మరియు తేనె రెండింటిలోను యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన
పసుపు,తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. అలాగే దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి అన్నీ రకాల శ్వాస సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉండుట వలన శరీరంలో పెరుకుపోయిన కొవ్వును, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడి అధిక బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే ముఖం మీద నల్లని మచ్చలు మరియు పిగ్మింటేషన్ వంటి సమస్యలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
అయితే ఈ మిశ్రమాన్ని గర్భిణీలు మరియు అలర్జీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే తీసుకోవటం మంచిది. తేనె ఆర్గానిక్ తేనె వాడితే మంచిది. అలాగే పసుపు కొమ్ములను ఆడించిన పసుపు వాడితే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.