Healthhealth tips in telugu

వీటిని ఇలా తీసుకుంటే 15 రోజుల్లో థైరాయిడ్ సమస్య కంట్రోల్‌…ముఖ్యంగా ఆ సమస్యలు ఉండవు

Thyroid foods In Telugu : థైరాయిడ్ అనేది మెడలోని ఒక గ్రంథి. దీని అసమతుల్యత కారణంగా బరువు పెరగడం, గొంతు వాపు, మానసిక కల్లోలం, జుట్టు రాలడం, బలహీనత, చిరాకు, నిద్రలేమి, కోపం, పొడి చర్మం, జలుబు, నిరాశ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్ల స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుంది.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. థైరాయిడ్ సమస్యలకు సహజమైన మరియు సమర్థవంతమైన నివారణలుగా పనిచేసే సూపర్‌ఫుడ్‌ ల గురించి తెలుసుకుందాం. ఈ సూపర్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు అంటున్నారు.
Amla Health benefits In telugu
ధైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. ఉసిరి థైరాయిడ్ నియంత్రణలో సహాయపడుతుంది. ఉసిరిలో నారింజ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ విటమిన్ సి మరియు దానిమ్మపండ్ల కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
gummadi ginjalu benefits in telugu
గుమ్మడికాయ గింజలలో జింక్ చాలా సమృద్దిగా ఉంటుంది. ఇది ఇతర విటమిన్లు మరియు ఖనిజాలను శరీరం గ్రహించడంలో సహాయపడుతుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ మరియు సంతులనాన్ని ఉత్తేజపరిచేందుకు జింక్ చాలా ముఖ్యం. ప్రతి రోజు ఒక స్పూన్ గుమ్మడి గింజలను ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
green gram benefits in telugu
పెసలలో ఉండే అయోడిన్ థైరాయిడ్ నియంత్రణలో సహాయపడతాయి. పెసలలో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు మినరల్స్,ఫైబర్, అయోడిన్ పుష్కలంగా ఉన్నాయి. థైరాయిడ్ యొక్క సాధారణ లక్షణాలలో ఒకటైన మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీవక్రియ రేటును పెంచి సమస్యను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.