Healthhealth tips in telugu

బ్రౌన్ రైస్ Vs రెడ్ రైస్…రెండింటిలో బరువు తగ్గించటానికి ఏది బెస్ట్…?

Weight Loss : ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ దాదాపుగా అధిక బరువు సమస్య అనేది ఉంది. అధిక బరువు విషయంలో మనం తీసుకొనే ఆహారం చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో చాలా మంది తెల్ల అన్నం తినటం మానేసి బ్రౌన్ రైస్, రెడ్ రైస్ వంటి వాటిని తీసుకుంటున్నారు.
red rice 2అయితే బరువు తగ్గటానికి బ్రౌన్ రైస్, రెడ్ రైస్ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పోషక పదార్ధాలను మరింత మెరుగుపరచటానికి సహాయపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే రెడ్ రైస్ కూడా ఒక తరహాలో ఉండే బ్రౌన్ రైస్ అనే చెప్పవచ్చు.

రెడ్ రైస్ లో మాంగనీస్ సమృద్దిగా ఉండుట వలన కణజాలం, ఎముకల ఏర్పాటులో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడం,జీవక్రియ,రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ , రెడ్ రైస్ రెండింటిలోను ఫైబర్, పోషకాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. శరీర జీవక్రియలకు,శరీరంలో కొవ్వు కరిగించటానికి బ్రౌన్ రైస్,రెడ్ రైస్ రెండూ దోహదం చేస్తాయి.

బ్రౌన్ రైస్ తో పోలిస్తే రెడ్ రైస్ కాస్త రుచికరంగా ఉంటుంది. తెల్ల అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్, రెడ్ రైస్ తీసుకోవటం వల్ల ఆరోగ్య పరంగా మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు నిపుణులు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.