మహానటి తీసిన నాగ్ అశ్విన్ ఎవరు? అతను భార్య ఎవరో తెలిస్తే షాక్

మహానటి సావిత్రి జీవిత కథ అచ్చుగుద్దినట్టు తెరపై ఆవిష్కరించి తెలుగులో మొదటి బయో పిక్ ని విజయవంతంగా తీసి ఔరా అనిపించాడు నాగ్ అశ్విన్. రాఘవేంద్రరావు,కే. విశ్వనాథ్,బాపు వంటి దర్శకులే బయో పిక్ లు తీయటానికి వెనకాడారు. అలాంటి సమయంలో సావిత్రి బయో పిక్ తీసి మెప్పించి ఇండస్ట్రీలో ఫెమస్ అయ్యాడు నాగ్ అశ్విన్. అసలు నాగ్ అశ్విన్ ఎవరు… ఎక్కడి నుండి వచ్చాడు….బ్యాక్ గ్రౌండ్ ఏమిటి….తల్లితండ్రులు ఎవరో తెలుసుకుందాం. నాగ్ అశ్విన్ పుట్టింది హైదరాబాద్ లోనే. అతని తండ్రి డాక్టర్ జయరాం రెడ్డి, డాక్టర్ జయంతి రెడ్డి ఇద్దరు వైద్యులే. వీరి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ కాగా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.

నాగ్ అశ్విన్ బాల్యం అంతా హైదరాబాద్ లోనే గడిచింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 10 వ తరగతి వరకు చదివాడు. మాస్ కన్యునికేషన్ జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసారు. నాగ్ అశ్విన్ కి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. అసిస్టెంట్ డైరెక్టర్,రైటర్ గా కెరీర్ ని ప్రారంభించి మొదటి సినిమా ఎవడే సుభ్రమణ్యంతో దర్శకుడిగా ఎదిగాడు.

నేను మీకు తెలుసా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. శేఖర్ కమ్ముల లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు కూడా పనిచేసాడు. నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ అధినేత బడా నిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంకా దత్ ని పెళ్లి చేసుకున్నాడు.

అశ్వినీదత్ అల్లుడిగా సినిమాలపై ఉన్న అభిమానంతో మామ బేనర్ లోనే రెండు సినిమాలు తీసాడు. భార్య ప్రియాంక దత్ ప్రోత్సాహంతో మహానటి సినిమాను తీసి అందరి చేత ఔరా అనిపించాడు.