Kitchenvantalu

చలికాలంలో వచ్చే అన్నీ సమస్యలకు చెక్ పెట్టె ఉసిరి రసం…అసలు మిస్ కావద్దు

Usirikaya rasam recipe in telugu : చలికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి ఉసిరికాయ రసం బాగా సహాయపడుతుంది. ఈ చలికాలంలో ఎక్కువగా జీర్ణ సంబంద సమస్యలు వస్తూ ఉంటాయి. అజీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే గొంతులో కఫం, జలుబు వంటి వాటిని తగ్గిస్తుంది.

ఈ రసాన్ని చింతపండు వేయకుండా తయారుచేస్తున్నాం. ఉసిరి రసంను ఎలా తయారుచేయాలో చూద్దాం. ఈ సీజన్ లో ఉసిరికాయలు చాలా విరివిగానే లభ్యం అవుతాయి. మిక్సీ జార్ లో నాలుగు నిమ్మకాయ సైజ్ లో ఉండే ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మిరియాలు వేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద టమోటా ముక్కలు వేసి పావు కప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అరస్పూన్ జీలకర్ర,రెండు చిటికెల ఇంగువ వేసి ఆవాలు చీట్లాక రెండు రెబ్బల కరివేపాకు,ఒక ఎండుమిరప ముక్కలు వేసి వేగించాలి.
Joint Pains
ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం తరుగు,ఒక పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. ఆ తర్వాత మిక్సీ చేసిన ఉసిరి,టమోటా పేస్ట్ వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అరస్పూన్ పసుపు వేయాలి. ఆ తర్వాత లీటర్ న్నర నీటిని పోసి మరిగించాలి. ఈ రసంలోకి చింతపండు అవసరం లేదు. ఉసిరిలోని పులుపు, వగరు, టమోటలోని పులుపు సరిపోతుంది.
Ginger benefits in telugu
ఈ రసం బాగా మరిగాక పావు కప్పు ఉడికించిన కందిపప్పు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి దించేయాలి. ఈ రసంను జలుబు చేసే పిల్లలకు రోజు విడిచి రోజు పెడితే చాలా మేలును కలిగిస్తుంది. ఈ రసం మిరియాల ఘాటుతో ఉండాలి. అలాగే ఈ రసంకు బాగా పండిన టమోటాలు వాడాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.