Movies

ఎన్టీఆర్ అప్పట్లో అంత లావు అవ్వటానికి కారణం ఏమిటో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్న ‘ఈ మాయా పేరేమిటో ‘సినిమా ఆడియోని విడుదల చేసారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో ఫైట్స్ విజయ్ మాస్టర్ కంపోజ్ చేశారట. అప్పట్లో నేను చాలా లావుగా ఉండేవాడిని అని, ఆలా ఉండటానికి విజయ్ భార్య సుమతి అని చెప్పాడు. ఆ తల్లికి నాకు ఋణానుబంధం ఉందని,తీర్చుకోలేనిది అని అన్నాడు. అప్పట్లో ఎన్టీఆర్ బాగా తినేవాడట. ఎన్టీఆర్ కి ఇష్టమైనవి వండమని విజయ్ భార్య సుమతికి చెప్పేవాడట. ఆమె అన్ని రకాలు వండి షూటింగ్ స్పాట్ కి పంపేదట. అలాగా తనకు బాగా ఇష్టమైన మూలుగలను ఒకటో రెండో కాకుండా 200 వరకు పంపేవారట.

అలాగా విజయ్ దగ్గర ఉండి వడ్డించటమే కాకుండా ఎలా తినాలో కూడా నేర్పించాడట. అందుకే మధ్యలో విపరీతమైన లావు అయ్యిపోయాడట. దీనికి కారణం ఫైట్ మాస్టర్ విజయ్,అయన భార్య సుమతి అని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆ తల్లి ఋణం తీర్చుకోలేనిది అని చెప్పి అందర్నీ నవ్వులో ముంచెత్తాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."