Movies

శర్వానంద్ ఎవరి కొడుకో తెలుసా… హీరో రామ్ కి శర్వానంద్ కి ఉన్న లింక్ ఏమిటో తెలుసా?

మొదట్లో చిన్నా చితకా వేషాలు వేసినా, ఆ తర్వాత తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న శర్వానంద్ ఇప్పుడున్న ఇప్పటి వరకూ యువ హీరోల్లో సక్సెస్ రేటు చూస్తే శర్వానంద్ ఓ మెట్టు పైనే వున్నాడు. అందుకే యువ హీరోల్లో ప్రత్యేక అతనిది స్పెషల్ స్టైల్. కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే శర్వానంద్ ఒకసారి కమిట్ అయితే ఆ మూవీకోసం సర్వశక్తులు ధారపోస్తాడని అంటారు.

ఇలాంటి మంచి లక్షణమే ఫిలిం మేకర్స్ లో ఇతనికి పేరు తెచ్చేలా చేసింది.అంతే కాదు,తెలుగు స్పష్టంగా పలకడంలో ఈ యువ హీరో ముందు వరుసలో ఉంటాడని సినీ క్రిటిక్స్ నూటికి నూరు మార్కులు వేస్తారు. సినిమాల్లో విజయం సాధించడానికి అతడు ఎన్నో సంవత్సరాలుగా పడిన శ్రమ చాలా వుంది. అనుకున్నది సాధించేవరకూ విశ్రమించని శర్వానంద్ 1984మార్చి10న విజయవాడలో తాతయ్య ఇంట జన్మించాడు.

ఆ తర్వాత శర్వా ఫామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివేటప్పుడు రానా,రామ్ చరణ్ తదితరులు శర్వా క్లాస్ మేట్స్ .ఇప్పటికీ వీళ్లందరి మధ్యా మంచి స్నేహం వుంది.నిజానికి స్కూల్ కి వెళ్లడం అంటేనే శర్వానంద్ కి నరకంలోకి వెళ్లినట్లు ఉండేదట. అందుకే స్కూల్ బస్ లోంచి దూకేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమా మారితే చాలు దగ్గరలోని ఆనంద్ థియేటర్ లో ప్రత్యక్షం అయ్యేవాడు. ఇక స్కూల్లో లేకుంటే సినిమా హాలులో ఉన్నట్టే లెక్క.

ఇతని తండ్రి ఎం ఆర్ వి ప్రసాదరావు బిజినెస్ మ్యాన్,తల్లి వసుంధరా దేవి హౌస్ వైఫ్. ఇంట్లో వ్యాపార సంబంధ విషయాలు చర్చకు వచ్చినప్పటికీ శర్వానంద్ మనసు మాత్రం సినిమాల మీదే ఉండేది. డిగ్రీలో ఉండగా జూబ్లీ హిల్స్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడేందుకు వెళ్లే శర్వానంద్,సినిమాల్లో ఛాన్స్ కోసం తెగ ప్రయత్నం చేసేవాడు.

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్ తో అక్కడే పరిచయం ఏర్పడడంతో అతని సలహా మేరకు శర్వానంద్ ముంబై వెళ్లి నమిత కిషోర్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. ఎన్నో ఆశలతో హైదరాబాద్ తిరిగొచ్చిన అతనికి తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే వైజాగ్ సత్యానంద్ దగ్గర శిక్షణ పొందితే ఛాన్స్ లు వస్తాయన్న సెంటిమెంట్ తో అక్కడికి వెళ్ళాక అనుకున్నట్టే, కొత్త నటీనటుల కోసం అక్కడ ఆడిషన్స్ నిర్వహించగా, శర్వానంద్ సెలెక్ట్ అయ్యాడు.

అ విధంగా 19 ఏళ్ళ వయసులోనే 5వ తారీఖు అనే చిత్రంలో నటించిన, అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదన్నట్లు సైడ్ అయిపొయింది. ఇక చిన్నా చితక పాత్రలతో సైతం నటించడంతో శంకర్ దాదా ఎంబిబిఎస్, సంక్రాంతి, లక్ష్మి,రాజు మహారాజు వంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు. నిజానికి వీటికన్నా ముందే యువసేన మూవీలో నలుగురు హీరోలలో ఒకడిగా నటించాడు.

వెన్నెల మూవీలో సైకో పాత్రలో అందరినీ మెప్పించాడు. ఇక గమ్యం మూవీ తో దశ తిరిగింది. అక్కడ నుంచి ఈ యువ హీరోపై నిర్మాతల దృష్టి పడింది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందే యుఎస్ వెళ్లిపోయిన శర్వానంద్ ఆ సినిమా ఆడకపోతే ఇండియా తిరిగి రాకూడదని అనుకున్నాడు.

అయితే ఈ మూవీ హిట్ అవ్వడంతో తిరిగి వచ్చి,ప్రస్థానం,జర్నీ,రన్ రాజా రన్,ఎక్స్ ప్రెస్ రాజా లాంటి చిత్రాలు అతని కెరీర్ ని టాప్ రేంజ్ కి తీసుకెళ్లాయి. 2017లో వచ్చిన శతమానం భవతి మూవీతో శర్వానంద్ స్టామినా తెల్సివచ్చింది. మహానటుడు మూవీతో మరోమెట్టు ఎక్కిన శర్వా,ప్రస్తుతం విరాట్ పర్వం అనే మూవీలో నటిస్తున్నాడు.

హీరోయిన్స్ తో మర్యాదగా మసలుకుంటూ,ఏ ఒక్క వివాదంలో లేడని చెప్పవచ్చు. అందుకే రూమర్స్ ,ఎఫైర్స్ లేవు. షూటింగ్ అయితే చాలు నేరుగా ఇంటికే తప్ప పబ్ లు షికార్లు ఉండవు. ఇక శర్వా సోదరునికి హీరో రామ్ సోదరినిచ్చి పెళ్ళిచేయడం వలన రామ్ తో బంధుత్వం ఉంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలిని శర్వానంద్ పెళ్లాడబోతున్నట్లు టాక్ వచ్చినప్పటికీ అందులో వాస్తవం లేదని తేలిపోయింది.