Movies

ఎన్నో సినిమాల్లో BOSS గా కన్పించిన శంకర్ మేల్కొటి నిజ జీవితంలో కూడా పెద్ద కంపెనీకి BOSS…

అది సినిమా .. జీవితం అలా ఉండదు అంటారు .. కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఆయనిది అదే పొజిషన్. అవును, చాలా సినిమాల్లో పిల్లి గడ్డం నల్లకోటు,లోపల తెల్ల చొక్కాతో కనిపించే ‘మేల్కోటి’ తెల్సు కదా. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈయన నువ్వే కావలి,ఆనంద్, మన్మధుడు,సంతోషం ,ఆకాశ వీధిలో ఇలా చాలా సినిమాల్లో ఆయన బాస్ పాత్రలోనే కనిపించి అలరించారు. ఆయన నటన, వాక్చాతుర్యం తో ఇలాంటి పాత్రలకు ఆయన పెట్టింది పేరు.వాక్చాతుర్యం అంటే వచ్చీ రాని తెలుగులో అమెరికన్ యాసను జోడించి గమ్మత్తుగా పదాలు పలుకుతూ డైలాగ్స్ చెప్పడమే స్పెషాలిటీ గల మేల్కొటి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే, బయట నుంచి చూసి ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దనే సామెత గుర్తొస్తుంది.

ఈయన అసలు పేరు శంకర్ మేల్కొటి. ఈయన వైఫ్ రమ. వీళ్ళకి ఇద్దరు సంతానం. ఓ కొడుకు, ఓ కూతురు. ఈనాడు గ్రూపు మార్గదర్శిలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న ఈయన ముంబయిలో పనిచేస్తూ మార్కెటింగ్ వ్యవహారాల రీత్యా హైదరాబాద్ వచ్చారు. ఇక అదే సమయంలో రామోజీరావు శ్రీవారికి ప్రేమలేఖ మూవీ తీస్తున్నారు. అందులో ఓ పాత్రకి మేల్కొటి సరిగ్గా సరిపోతారని స్క్రీన్ టెస్ట్ కి రప్పించారు.

ఇక అక్కడే గల వేటూరి సుందర రామమూర్తి పైనుంచి కిందిదాకా మేల్కొటి ని చూసి, స్క్రీన్ టెస్ట్ అక్కర్లేదు, ఏమీవద్దు అనేసి,,రాత్రి కూర్చుని భోంచేద్దాం మందు కొడతావా అని అడిగారట. ఇక అంతే ఆనాటినుంచి దూకుడు వరకూ అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ వరకూ 180 సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్, కమెడియన్ గా నటించి మెప్పిస్తూ వచ్చారు. ఇక ఆనాడు ఏదో సరదాకి వేటూరి నోటివెంట వచ్చిన ఆ మాటని,మన్మధుడు సినిమాలో డైలాగ్ గా ‘గుడ్ ఈవినింగ్ నేను మందు కొట్టేముందే చెబుతాను’అని ప్రేక్షకులను మేల్కొటి నవ్వుల్లో ముంచెత్తాడు.

తెలుగులోనే కాదు ఉర్దూ, ఇంగ్లీష్,హిందీలో మాట్లాడతారు. ఇక దూకుడు మూవీలో బ్రహ్మానందానికి మావ పాత్రలో, అల్ల్లుడు పెట్టే హెరాస్మెంట్ భరించలేక శాపనార్ధాలు పెట్టే రోల్ లో ఆయన నటన అందరినీ నవ్వుల్లో ముంచెత్తుంది. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇక కూతురు ఫేమస్ క్రికెటర్ శ్రీధర్ భార్య. కాగా ,మేల్కొటి మనకు కనిపించే నటుడు మాత్రమే కాదు,తన సొంత మార్కెటింగ్ కంపెనీకి సి ఇ ఓ గా వ్యవహరిస్తున్నారు. నిజజీవితంలో కూడా ఆయన బాస్ అనే విషయం తెల్సింది కదా.