Movies

కమెడియన్ శ్రీనివాసరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా… తండ్రి ఏమి చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

దేనికైనా నసీబ్ ఉండాలని అంటారు. అదేనండి లక్కు ఉండాలి. సరిగ్గా ఇప్పుడు కమెడియన్ శ్రీనివాస రెడ్డి విషయంలో అదే జరిగింది. జంబలికడి పంబ మూవీతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఓ వైపు మంచి కథ దొరికితే హీరోగా వేసేస్తూ, మరోవైపు కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. జయమ్ము నిశ్చయంబు రా మూవీలో సిన్సియర్ లవర్ గా చేసి , ఆ సినిమాను హిట్ కొట్టించాడు.అయితే ఈ మధ్య హీరోగా వేయడం వలన ఆ సినిమా చేస్తూ,వేరే సినిమాల్లో నటించకపోవడం వలన ఇతర సినిమాల్లో కనిపించడం లేదు. రెండు పడవల మీద ప్రయాణం కష్టమని అంటారు. సునీల్ మొదట్లో కమెడియన్ వేస్తూ ,ఆతర్వాత హీరో అయ్యాడు. ఇక హీరోగా సినిమాలు రాకపోవడంతో మళ్ళీ కమెడియన్ అవతారం ఎత్తుతున్నాడు. కానీ శ్రీనివాస రెడ్డి అటు ఇటు కూడా తన హవా సాగిస్తున్నాడు.

ఇమేజ్ చట్రం నుంచి బయటపడాలని కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే హీరోగా కూడా శ్రీనివాస రెడ్డి తన సత్తా చాటుతున్నాడు. ఆ మధ్య గీతాంజలి సినిమాతో హీరోగా మారి, తొలి హిట్ రుచి చూసాడు. అయితే హీరో అయ్యానని గొప్పలకు పోకుండా కమెడియన్ గా వచ్చిన ఛాన్స్ లన్నీ వినియోగించుకుంటూ వస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అ ఆ సినిమాలో మంచి రోల్ వేసి ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత ప్రేమమ్, జయమ్ము నిశ్చయంబురా,జంబలికడి పంబ సినిమాలతో టాలీవుడ్ లో తనదైన శైలి కనబరుస్తూ,సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కు చెందిన శ్రీనివాసరెడ్డి,1973 ఫిబ్రవరి 23న ఓ రైతు కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి వ్యవసాయం చేస్తూ చదివించాడు. ఖమ్మంలోని డిగ్రీ చదివి, సినిమా ఛాన్స్ ల కోసం హైదరాబాద్ వచ్చాడు

చాలా కాలం ప్రయత్నించి 2001లో కొత్త హీరోతో వచ్చిన ఇష్టం సినిమాతో శ్రీనివాసరెడ్డి కమెడియన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇడియట్,డార్లింగ్,సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అల్లు అర్జున్, రవితేజ ఇలా అగ్ర హీరోలతో కల్సి పలు సినిమాల్లో కమెడియన్ గా తన కంటూ ఓ గుర్తింపు పొందాడు. సినిమాల రుచి బాగా తెల్సిన శ్రీనివాస రెడ్డి ఇటు కమెడియన్ గా చేస్తూనే ,వీలుచిక్కినపుడు హీరోగా వేస్తుంటానని చెబుతున్నాడు. ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరెడ్డి.