స్వర్ణకమలంలో నటించిన ఈ బాబు సినిమాలకు దూరంగా ఇప్పుడు ఎక్కడ ఎలా వున్నాడో తెలుసా?

టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా అరంగేట్రం చేసి పెద్దయ్యాక స్టార్ హీరోలుగా ఎదిగారు. అందాల నటి దివంగత శ్రీదేవి అలానే బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఇండియా అంతటా స్టార్ డమ్ తెచ్చుకొని అతి పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. ఇక బాలయ్య, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటివాళ్లు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి, ఆ తర్వాత పెద్దయ్యాక ,స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని సినీ రంగాన్ని ఓ ఊపు ఊపేస్తున్నారు. అయితే వీళ్ళందరికీ టాలెంట్ తోపాటు సినీ బ్యాక్ గ్రౌండ్ దండిగానే ఉండడంతో ఎంతోకాలం నుంచి సినీరంగంలో కొనసాగుతున్నారు. అయితే 1989- 90ల మధ్య తన హావభావాలతో, నటనతో,డాన్స్ తో అందరినీ అలరించిన మంత్ర ముగ్దుల్ని చేసిన చిచ్చర పిడుగు ఒకడున్నాడు.

అతన్ని స్ఫూర్తిగా తీసుకుని అప్పట్లో చాలామంది పిల్లలు అతనిలా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నవాళ్లూ వున్నారు. ఇంతకీ అతను ఎవరంటే , అదేనండి స్వర్ణకమలం మూవీలో నటించిన షణ్ముఖ శ్రీనివాస్. 1985లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన జేబుదొంగ చిత్రంలో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన షణ్ముఖ శ్రీనివాస్ ఏలూరులో పుట్టాడు. చిన్నతనం నుంచీ,నాట్యమంటే చాలా మక్కువ.

ఆ ఇంట్రెస్ట్ తోనే కూచిపూడి నాట్యంలో మాంచి ప్రావీణ్యం సంపాదించాడు. చూసి చూడగానే ముద్దుగా కన్పడ్డమే కాదు తన వయస్సుకి మించిన మాటలతో అందరినీ ఆకట్టుకునేవాడు. నిజానికి ఇతని డాన్స్ చూసిన వాళ్ళు ఈ అబ్బాయి సినిమాల్లో నటిస్తే మంచి పేరు వస్తుందని చాలామంది అనడంతో ఇతని డాన్స్ ఫోటోలను మెగాస్టార్ కి పంపడం, దీంతో అయన నటించిన మూవీ జేబుదొంగ లోనే అవకాశం దక్కింది షణ్ముఖ శ్రీనివాస్ కి.

ఇక క్లాసికల్ సినిమాలకు పెట్టింది పేరైన కళా తపస్వి కె విశ్వనాధ్ తాను తీయబోయే శృతిలయలు చిత్రంలో నాట్యం తెల్సిన కుర్రాడికోసం అన్వేషణ మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే నాట్యం కూడా వచ్చిన షణ్ముఖ శ్రీనివాస్ మెదిలాడంతో వెంటనే ఆడిషన్స్ కి పిలిపించి, తాను అనుకుంటున్నా పాత్రకి విశ్వనాధ్ ఒకే చెప్పేసారు.

1987లో విడుదలైన శృతిలయలు సూపర్ హిట్ అవ్వడంతో, ఆచిత్రంలో హీరో రాజశేఖర్ కన్నా, నాట్యంతో కళాత్మకంగా నటించిన షణ్ముఖ శ్రీనివాస్ కి ఎక్కువ పేరొచ్చింది. అంతేకాదు ఆ సినిమాలో నటనకు ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీతో ది డిసీవర్స్ అనే ఇంగ్లీషు మూవీలో హీరాలాల్ పాత్రతో అందరినీ మెప్పించే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఇక వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్ అవకాశాలు వరుసగా వచ్చాయి.

సరిగ్గా 1989- 90 మధ్యకాలంలో కె విశ్వనాధ్ తీసిన స్వర్ణకమలం మూవీలో ఓ అనాధగా ,మరీ ముఖ్యంగా హీరో వెంకటేష్ ఫ్రెండ్ గా నటించే అద్భుత ఛాన్స్ కొట్టేసాడు. ఇక ఆ మూవీలో షణ్ముఖ శ్రీనివాస్ అందరినీ అలరించి, మరోసారి నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆవిధంగా అతని నటన చూసిన వాళ్లంతా భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు.

అయితే సినిమాలో తనకు తగ్గ పాత్రలు గల సినిమాలు రాకపోవడం,కె విశ్వనాధ్ కూడా సినిమాలు తీయకపోవడంతో షణ్ముఖ శ్రీనివాస్ అందరు అనుకున్నట్టు ఎదగలేకపోయాడు. ముగ్గురు కొడుకులు, కౌరవ సామ్రాజ్యం,అయ్యప్ప స్వామి మహ్యత్యం చిత్రాల్లో నటించిన షణ్ముఖ శ్రీనివాస్ 1992తర్వాత మళ్ళీ సినిమాల్లో కనపడలేదు.

అయితే కొన్నేళ్ల తర్వాత ఎవరూ ఊహించని విధంగా అన్వేషిత సీరియల్ తో బుల్లితెరపై ప్రత్యక్షం అయ్యాడు. ఆతర్వాత చదువుపై శ్రద్ధ పెట్టిన షణ్ముఖ శ్రీనివాస్ ఎల్ ఎల్ బి లో పట్టభద్రుడయ్యాడు. ప్రస్తుతం హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూనే,.షణ్ముఖ ప్రాజెక్ట్ అనే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీ నెలకొల్పి డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

2010లో మ్యారేజ్ కూడా చేసుకున్న షణ్ముఖ శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉంటున్నాడు. ఓ పక్క ప్రొఫెషన్ లో వుంటూనే, మరోపక్క వ్యాపారంలో ఎదుగుతున్న షణ్ముఖ శ్రీనివాస్ ఇప్పటికీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా అన్నది సస్పెన్స్ .