Movies

గోపీచంద్ జీవితంలో ఎవరికీ తెలియని మర్చిపోలేని అత్యంత విషాదకరమైన సంఘటనలు

టాలీవుడ్ లో చాలామంది హీరోల వారసులు దూసుకొస్తున్నా సరే,స్వశక్తితో ఎదిగే నటీనటులు కూడా వున్నారు. అందులో గోపీచంద్ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ గల హీరోగా ఎదిగాడు. ఇక ఈయన చిత్రాలకు భారీగానే ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలకు భరోసా ఉందంటే అతని గొప్పతనం చెప్పక్కర్లేదు.

అందుకే బయ్యర్లు గోపీచంద్ మూవీ అంటే వెనుకా ముందూ ఆలోచించకుండా కొంటారన్న టాక్ వుంది. అయితే మొదటి సినిమాతో హీరోగా వచ్చి,ఆతర్వాత విలన్ గా చేయాల్సి వచ్చినా కూడా ఎక్కడా బాధ పడకుండా, ఆదిశగా అడుగులు వేసాడు గోపీచంద్. నిజానికి గోపీచంద్ ఒకప్పుడు అంటే బాల్యంలో ఖరీదైన జీవితం అనుభవించాడు. అయన ఫాదర్ టి కృష్ణ ప్రముఖ దర్శకుడుగా ఇండస్ట్రీకి సుపరిచితులు. ఆయన తీసిన సినిమాలన్నీ హిట్ కొట్టాయి. అయితే గోపీచంద్ కి 8ఏళ్ళ వయస్సులో తండ్రి మరణించడం పెద్ద షాక్.

టి కృష్ణ మరణంతో రోడ్డున పడ్డ కుటుంబాన్ని గోపీచంద్ తల్లి తన కష్టంతో నెట్టుకొచ్చింది. గోపీచంద్ తో పాటు అన్న ప్రేమ్ చంద్, ఓ కుమార్తె ఆమెకు వున్నారు. తండ్రి మరణంతో సొంతూరు ఒంగోలుకు పిల్లలతో సహా వచ్చేసిన తల్లి అక్కడ బంధువుల ఇంట ఆసరా పొందింది. వాళ్ళ ప్రోత్సాహంతో గోపిచంద్ చదువుకుని, రష్యాలో ఇంజనీరింగ్ చేసాడు.

అన్న ప్రేమ్ చంద్ సినిమాల్లో చేరి, ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే సొంత బ్యానర్ పై సినిమా తీసే యోచన చేస్తున్న సమయంలో ఓ రోజు రోడ్డు ప్రమాదంలో ప్రేమ్ చంద్ మరణించడం గోపీచంద్ ని షాక్ కి గురిచేసింది. వీసా ప్రోబ్లం వలన కనీసం అన్న ను కడసారి చూడ్డానికి కూడా రాలేకపోవడం, రష్యాలోని ఉండిపోవడం మరింత బాధించింది.

చిన్నతనంలో తండ్రిని కోల్పోవడం, ఊహ తెలిసాక తండ్రి లాంటి అన్నను కోల్పోవడం వంటి పరిణామాలు గోపీచంద్ ని తీవ్రంగా కలచివేశాయి. ఓ దశలో గోపి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అయితే తల్లి ఓదార్పుతో జీవితంపై ఆశలు చిగురింప జేసుకున్న గోపి,సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి, తండ్రి , అన్నల ఆత్మలు కూడా గర్వించేలా స్టార్ గా ఎదిగాడు.

గోపీచంద్ సోదరి ఓ డెంటిస్ట్ గా రాణిస్తోంది. సోదరి అంటే గోపికి ప్రాణం. తండ్రి అన్న లేకున్నా, తల్లి,సోదరిలను కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. కాగా సినిమాల్లో మంచి పొజిషన్ కి చేరుకున్నాక తన మనస్సుకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటివాడయ్యాడు. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లిచేసుకున్న గోపీచంద్ కి విరాట్ కృష్ణ అనే కుమారుడున్నాడు. చనిపోయిన తన తండ్రి పేరుని కొడుక్కి పెట్టుకుని , తండ్రిని అతని కొడుకులో చూసుకుని మురిసిపోతున్నాడు గోపీచంద్.