Devotional

మగవారికి ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా?

ఇప్పటివరకు మహిళలకు ప్రవేశం లేని ఆలయాల గురించి తెలుసు. కానీ మగవారికి ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా? అవి ఎక్కడ ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? ఆ ఆలయాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ ఆలయాలలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తే సెక్యూరిటీ ఆపేస్తారు. ఆ ఆలయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

బ్రహ్మ దేవుని ఆలయం

రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉన్న బ్రహ్మ దేవుని ఆలయంలోకి పురుషులకు అసలు ప్రవేశం లేదు. దానికి ఒక కారణం ఉంది. బ్రహ్మ యజ్ఞం చేయాలనీ అనుకున్నప్పుడు పక్కన సరస్వతి దేవి లేకపోవటంతో గాయత్రీ అనే మహిళను వివాహం చేసుకొని యజ్ఞం పూర్తి చేస్తాడు. సరస్వతి దేవి తిరిగి వచ్చి విషయాన్నీ తెలుస్కొని ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని శపిస్తుంది. ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.

చక్కులాతుకవు దేవాలయం

ఈ ఆలయం కేరళ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉంటారు. ఇక్కడ జరిగే ఉత్సవాలలో మహిళలే అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయంలోకి పురుషులను అనుమతించరు.

అట్టుకల్ దేవాలయం

ఈ దేవాలయం కేరళ లోని తిరువనంతపురంకి సమీపంలో ఉంది. ఈ ఆలయంలో పార్వతీదేవి కొలువై ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం నారి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు కేవలం మహిళలు మాత్రమే హాజరు అవుతారు. ఈ వారం రోజుల పాటు మహిళలు చాలా నియమ నిష్టలతో ఉంటారు. మగవారు అట్టుకల్ దేవాలయం వైపుగా వస్తే పాపాలు ఎదురు అవుతాయని నమ్మకం.

సంతోషిమాత ఆలయం

ఈ ఆలయం మహిళలకు,పెళ్లి కానీ అమ్మాయిలకు ప్రసిద్ధి చెందినది. ఈ వ్రతం ఆచరించే వారు పులుపు పదార్ధాలు తినకూడదు. ఎక్కువ మంది స్త్రీలు సంతోషిమాతను శుక్రవారం పూజిస్తారు. ఆ రోజు ఉల్లిపాయను తినకూడదు. సంతోషిమాత ఆలయంలోకి పురుషులకు అనుమతి లేదు. ఒకవేళ కొన్ని ఆలయాలలో అనుమతి ఉన్నా కఠినమైన నియమాలు ఉంటాయి.

భాగతీమాత ఆలయం

ఈ ఆలయం దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఒకటి.. ఈ ఆలయం కన్యాకుమారిలో ఉంది. ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత. అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.

మాతా ఆలయం

ఈ ఆలయం బీహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌ పూర్‌ పట్టణంలో ఉంది. అమ్మవారికి ప్రతి సంవత్సరం కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారికి ప్రవేశం లేదు.