MoviesTollywood news in telugu

ఖైదీ రుద్రయ్య సినిమా గురించి నమ్మలేని నిజాలు మీ కోసమే…అసలు నమ్మలేరు

khaidi rudraaiah full movie :సూపర్ స్టార్ కృష్ణతో అగ్ర నిర్మాత టి త్రివిక్రమరావు నిర్మించిన ఖైదీ రుద్రయ్య మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. అంతకుముందు ఘరానా దొంగ, యుద్ధం వంటి భారీ మూవీస్ నిర్మించిన త్రివిక్రమరావు హ్యాట్రిక్ మూవీ గా తీసిన ఖైదీ రుద్రయ్య మూవీలో శ్రీదేవి హీరోయిన్ గా అలరించింది.

ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కృష్ణ కెరీర్ లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. కృష్ణ నటన ఫాన్స్ ని ఆకట్టుకునేలా ఈ మూవీలో ఉంటుంది. తనకు, నేరస్తుడికి ఒకడే ఉమ్మడి శత్రువు కావడంతో నేరస్తుణ్ణి శిక్షించకుండా జడ్జి వదిలేయడం ఈ మూవీలోని కీలక అంశం. ఓ ఆంగ్ల చిత్రంలోని స్టోరీ లైన్ నచ్చేసిన త్రివిక్రమరావు వెంటనే పరుచూరి సోదరులకు చెప్పి కథ రెడీ చేయమన్నారు.

దాంతో 18 సీన్స్ గోపాలకృష్ణ, మిగిలిన సీన్స్ వెంకటేశ్వరరావు రాసారు. కథ గురించి అడగకుండానే కృష్ణ ఒకే చెప్పగా, హిందీలో బిజీగా ఉన్న శ్రీదేవికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి డేట్స్ త్రివిక్రమరావు సంపాందించారు. రేపు షూటింగ్ అనగా ముందురోజు రాత్రి స్క్రిప్ట్ త్రివిక్రమరావు చూసారు.

అసలు రెండు సీన్స్ లో తప్ప హీరోయిన్ కనపడకపోతే ఇన్ని లక్షలు పోసి సినిమా ఎందుకని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దాంతో పరుచూరి గోపాలకృష్ణ ఆ రాత్రి ఇంటికి వెళ్లకుండా ఆలోచించి కథలో మార్పు చేసారు. కృష్ణ లారీ డ్రైవర్, నూతన ప్రసాద్ క్లినర్, అయితే నూతన్ ప్రసాద్ కి లంచం ఇచ్చి శ్రీదేవి లారీ ఎక్కడం లాగా సీన్ మార్చారు. అ

లా 30 సీన్స్ లో కృష్ణ పక్కనే ఆమె ఉంటుంది. స్టోరీలో మార్పులేకుండా ఒక్క సీన్ తో సినిమా మారింది. చిరంజీవి క్లాప్ కొట్టారు. భారీ తారాగణంతో నిర్మించిన ఈ మూవీ 200 మంది మూడు సార్లు ఊటీ వెళ్లి షూటింగ్ చేసారంటే ఎంత ఖర్చు పెట్టారో అర్ధం అవుతుంది. ఈ సినిమా నైజాం లో హవా స్టార్ట్ చేసి,అన్ని ఏరియాల్లో ప్రభంజనం సృష్టించింది.