MoviesTollywood news in telugu

బాషా సినిమా గురించి ఈ నిజాలు మీకు తెలుసా…అయితే వెంటనే చూసేయండి

Basha Movie Details In telugu : హీరో ఇమేజ్, కథ , కథనం అన్నీ వెరసి సూపర్ హిట్ మూవీగా, ట్రెండ్ సెట్టర్ గా సౌత్ ఇండియాలో నిలిచిన మూవీ రజనీకాంత్ హీరోగా వచ్చిన బాషా. 1991లో అమితాబ్ హిందీ మూవీ హమ్ లో రజనీకాంత్ ఓ హీరో క్యారెక్టర్ చేసాడు. గోవిందాకు జాబ్ ఇప్పించే సీన్ ఒకటి ఉంది.

భారీ డైలాగ్, ఫైట్స్ లేకుండా షూట్ చేసిన ఆ సీన్ ని ఎడిటింగ్ టైం లో తీసేసారు. కానీ అది రజనీ మనసులో టాప్ సీన్ గా మిగిలిపోవడంతో అన్నామలై షూటింగ్ సమయంలో డైరెక్టర్ సురేష్ కృష్ణ చెప్పి, దీని ఆధారంగా కథ రెడీ చేస్తావా అని రజనీ అడిగారు. ఆర్టీసీ కండక్టర్ గా క్యారెక్టర్ డిజైన్ చేస్తూ కథ రెడీ చేయగా, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆటో డ్రైవర్ గా చేంజ్ చేసారు.

నగ్మా హీరోయిన్. విలన్ గా రఘువరన్, మ్యూజిక్ దేవా. ఇలా అన్నీ సెట్ చేసి, 1994ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసారు. వాహిని తదితర స్టూడియోస్ లో షూటింగ్ పూర్తి. హీరోని కట్టేసి కొట్టడం లాంటి సీన్స్ ఉంటేనే తర్వాత సీన్ పండుతుందని రజనీ చెప్పడంతో ఆ సీన్ తీశారు. అప్పట్లో ఓ పొలిటికల్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్లు వైరల్ అయ్యింది.

అయితే అది నిజం కాదని తర్వాత తెల్సింది. 9 కోట్ల బడ్జెట్ తో 70రోజుల్లో షూటింగ్ పూర్తి. 1995 జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ మూవీ అంతకుమించి బూస్టప్ ఇచ్చేలా ఉండడంతో తమిళనాట 75సెంటర్స్ లో సూపర్ టాక్. ఆటో డ్రైవర్ గా ఉండే హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందన్న అంచనాలు విశ్రాంతి సమయానికి పీక్ స్టేజ్ కి వెళ్లడం విశేషం.

ఇంటర్వెల్ తర్వాత బాషా గా మారే డాన్ సీన్ ఇండియన్ హిస్టరీలో టాప్ లెవెల్లో నిల్చింది. విలన్ అక్రమాలు రుజువుచేసి, జైలుకి పంపడం, హీరోయిన్ ని పెళ్లి నుంచి తీసుకెళ్లడం, రజనీ వస్తుంటే ,స్టేషన్ లో అధికారి సెల్యూట్ చేయడం, ఇలా ఎన్నో సీన్స్ పండాయి. ఇక బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే వంటి డైలాగ్స్ ఈలలు వేయించాయి.

తిరుగులేని సూపర్ స్టార్ గా రజనీకాంత్ ని నిలబెట్టిన సినిమా ఇది. హిందూ పేపర్ లో అయితే చిన్న ఆర్టికల్ కూడా రాసారు. చాలా మంది ఆటోవాళ్ళు తమ ఆటోకి రజనీ ఫోటో పెట్టుకున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఆటోలో కన్పిస్తాయి. అంతలా పాపులర్ అయ్యాడు. డైరెక్టర్ సురేష్ కృష్ణ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. దేవా సంగీతం సూపర్భ్ .

ఇక తెలుగులో రీమేక్ హక్కుల కోసం అల్లు అరవింద్ తో బేరం కుదరక పోవడంతో డబ్బింగ్ రైట్స్ 80 లక్షలకు వేరేవాళ్లకు ఇచ్ఛేసారు. ఇంత మొత్తంలో డబ్బింగ్ రైట్స్ కి ఇచ్చిన మూవీ ఇదే. అప్పటివరకూ 25లక్షలు ఉండేది. మొత్తం 30కోట్లు గ్రాస్ వసూలు చేసింది. 200సెంటర్స్ లో రిలీజైన ఈ మూవీ 100సెంటర్స్ లో 50రోజులు, 50సెంటర్స్ లో 100రోజులు ఆడిన సినిమా ఇది. 6సెంటర్స్ లో 175రోజులు ఆడింది. తమిళనాడులో 18కోట్లు ,ఆంధ్రాలో 10కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 5కోట్లు వసూలైంది.