Devotional

మీ పుట్టిన రోజు (బర్త్ డే ) ప్రకారం మీరు దేవున్నికి ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలో తెలుసా ఏంటో మీరే తెలుసుకోండి

పూజలో ప్రధానమైనది దీపారాధన. అంతేకాదు నిత్య దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉదయం, సాయంత్రం ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకమని అని ధార్మిక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో ఇంకా ఏదైనా ఫలమో నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే చాలు అని ప్రధానంగా పేర్కొంటున్నాయి. అయితే దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి.

ఎలాగంటే అలా చేయకూడదు. దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాతనే వత్తులు వేయాలి. వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించొచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి.
జన్మతేదిని బట్టి ఎన్ని వత్తులతో దీపారాదన చెయ్యాలి

* మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు జన్మించినవారు 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు జన్మించినవారు 7 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* మే 21 నుంచి జూన్ 20 వరకు జన్మించినవారు 6 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* జూన్ 21 నుంచి జూలై 20 వరకు జన్మించినవారు 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* జూలై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు జన్మించినవారు 3 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు జన్మించినవారు 6 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు జన్మించినవారు 7 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు జన్మించినవారు 2 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* నవంబర్ 21 నుంచి డిసంబర్ 20 వరకు జన్మించినవారు 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* డిసంబర్ 21 నుంచి జనవరి 20 వరకు జన్మించినవారు 6 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 వరకు జన్మించినవారు 6 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* ఫిబ్రవరి 21 నుంచి మార్చి 20 వరకు జన్మించినవారు 2 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.