Devotional

Deeparadhana:మీ పుట్టిన రోజు (బర్త్ డే ) ప్రకారం మీరు దేవునికి ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలో తెలుసా..?

Deeparadhana:పూజలో ప్రధానమైనది దీపారాధన. అంతేకాదు నిత్య దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉదయం, సాయంత్రం ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకమని అని ధార్మిక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి.

ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో ఇంకా ఏదైనా ఫలమో నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే చాలు అని ప్రధానంగా పేర్కొంటున్నాయి. అయితే దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి.

ఎలాగంటే అలా చేయకూడదు. దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాతనే వత్తులు వేయాలి. వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి.

మట్టి కుందులు కూడా ఉపయోగించొచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి.జన్మతేదిని బట్టి ఎన్ని వత్తులతో దీపారాదన చెయ్యాలి

* మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు జన్మించినవారు 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు జన్మించినవారు 7 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* మే 21 నుంచి జూన్ 20 వరకు జన్మించినవారు 6 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* జూన్ 21 నుంచి జూలై 20 వరకు జన్మించినవారు 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* జూలై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు జన్మించినవారు 3 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు జన్మించినవారు 6 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు జన్మించినవారు 7 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు జన్మించినవారు 2 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* నవంబర్ 21 నుంచి డిసంబర్ 20 వరకు జన్మించినవారు 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* డిసంబర్ 21 నుంచి జనవరి 20 వరకు జన్మించినవారు 6 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 వరకు జన్మించినవారు 6 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
* ఫిబ్రవరి 21 నుంచి మార్చి 20 వరకు జన్మించినవారు 2 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."