MoviesTollywood news in telugu

Ravi Teja “కిక్” సినిమాను ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసారు…ఎవరో తెలుసా?

Ravi Teja Kick movie : రవితేజ హీరోగా తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. రవితేజ నటించిన కిక్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతీసారి కూడా కిక్ మూవీ మంచి రేటింగ్స్ తీసుకొస్తుంటుంది. అంత పెద్ద బ్లాక్‌బస్టర్ గా ఈ చిత్రం నిల్చింది.

కిక్ కోసం ఏదైనా చేసే పాత్రలో మాస్ మాహరాజు రవితేజ చెలరేగిపోయాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. రవితేజ కెరీర్‌లో ఈ రోజుకు కూడా లాభాల పరంగా కానీ.. మార్కెట్ పరంగా కానీ చూసుకుంటే అతడి టాప్ సినిమాల్లో కిక్ ఒకటి. అప్పట్లోనే 30 కోట్ల వరకు వసూలు చేసి రవితేజ రేంజ్ ఏంటో ఈ చిత్రం చూపించింది. కిక్ సినిమా 2009 మే 8 న విడుదల అయింది.

అప్పటికే అతిథి, అశోక్ లాంటి ఫ్లాపులతో వెనకబడిపోయిన సురేందర్ రెడ్డి కిక్ కథ సిద్ధం చేసుకున్నాడు. దీన్ని ఒప్పించడానికి చాలా మంది హీరోలను కలిసాడు. కానీ చాలా మంది దీన్ని రిజెక్ట్ చేసారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఈ మూవీ సరైన హీరోకే పడిందని తర్వాత అభిమానులు కూడా సంతోషపడ్డారు. వక్కంతం వంశీ రాసిన ఈ కథ ముందు రవితేజ కోసం మాత్రం సిద్ధం చేయలేదు. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన కథ కూడా కాదు.

ప్రభాస్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ముందుగా ఈ కథను సురేందర్ రెడ్డి వినిపించాడు. అయితే వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నారో ఏమో గానీ మొత్తానికి ఈ చిత్రానికి నో చెప్పారు. ఆ తర్వాత రవితేజ లైన్‌లోకి వచ్చాడు. మాస్ రాజా ఎంట్రీతో కిక్ స్వరూపమే మారిపోయింది. ఆయనతో పాటు బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టింది. చివర్లో పాప ఎమోషనల్ ఎపిసోడ్, ఇలియానా గ్లామర్, కొత్త నటుడు శ్యామ్ నటన, ఇలా అన్నీ కలిపి అప్పటి వరకు 10 కోట్లున్న రవితేజ మార్కెట్‌ను ఏకంగా 25 కోట్లకు కిక్ మూవీ పెంచేసింది.