MoviesTollywood news in telugu

40 కోట్ల భారీ సినిమా ఎందుకు ఆగిపోయింది…ఆ సినిమా వెనక ఆసక్తికరమైన విషయాలు

Mahesh Babu Movie : మన హీరోలు కొన్ని సినిమాలు చేద్దామని ఫిక్స్ అవుతారు. కానీ కొన్ని కారణాలతో అవి ఆగిపోతూ ఉంటాయి. అలాంటి సినిమా మహేష్ బాబు కెరీర్ లో కూడా ఉంది. అవును, మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా నిజానికి ఎవరికోసం చేశారో తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వాళ్ళు రిజిస్టర్డ్ చేయించారు.

కిక్ మూవీ తర్వాత డైరెక్టర్ సురేంద్ర రెడ్డి ఓ సినిమా చేయాలనీ అనుకున్నాడు. అప్పటీకే ఖలేజా షూటింగ్ లో ఉన్న మహేష్ ని కల్సి ఓ డాన్ టైప్ సినిమా కథ చెప్పాడు. అంతకుముందు అతిధి మూవీ ప్లాప్ అయినప్పటికీ కథ,డైరెక్టర్ మీద నమ్మకంతో మహేష్ ఒకే చేసాడు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ తీసేది మేమే అని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ప్రకటించారు.

అప్పటివరకూ ఎవరూ పెట్టని విధంగా 40కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీయాలని ప్లాన్ చేసారు. మహేష్ కి 2న్నరకోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. హీరోయిన్ గా కరిష్మా కపూర్ ని ఎంపిక చేసారు. ఖలేజా తర్వాత 2010లో షూటింగ్ ప్రారంభిస్తామని ఇటు మహేష్ నుంచి,అటు ప్రొడ్యూసర్స్ నుంచి కూడా ప్రకటనలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకు పోయారు.

కనీసం ప్రీ ప్రొడక్షన్ కి కూడా డబ్బు లేకుండా పోయింది. దీంతో మహేష్ తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడు. దీంతో సురేంద్ర రెడ్డి ఊసరవెల్లి మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో స్టార్ట్ చేసాడు. అదే సమయంలో దశరధ్ తో కలిసి ప్రభాస్ చేసే సినిమాకు మిస్టర్ పెర్ఫెక్ట్ అనుకున్నారు. అయితే టైటిల్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ దగ్గర ఉందని తెల్సి వాళ్లకు ప్రభాస్ ఫోన్ చేయడంతో ఒకే చేసారు. అలా ప్రభాస్ హీరోగా మిస్టర్ ప్రెఫెక్ట్ వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."