MoviesTollywood news in telugu

Tv టాప్ స్టార్స్, యాంకర్స్ రోజుకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా…?

serial artist remuneration details : బుల్లితెర మీద కనిపించే యాంకర్స్ నటీనటులు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే నటీనట్లతో సమానంగా స్టార్డం స్టార్ స్టేటస్ సంపాదించుకుంటున్నారు. బుల్లితెరలో యాంకర్స్ అలాగే సీరియల్స్ లో నటిస్తున్న నటీమణులు రోజుకి ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే చాలా ఆశ్చర్యం ఇస్తుంది

సుమ
ఒక పక్క యాంకర్ గా మరో పక్క ఈవెంట్స్ చేస్తూ సుమ అత్యధిక పారితోషికం తీసుకుంటుంది. సుమ ఒక్క ఈవెంట్ కి రూ. 3.5 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.

అనసూయ
ఒక పక్క సినిమాలు మరొక పక్క ఈవెంట్స్ చేస్తున్న అనసూయ ఒక్కో ఈవెంట్ కి దాదాపుగా 2 నుండి 3 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.

రష్మీ గౌతమ్
జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటి సంపాదించిన రష్మీ గౌతమ్ ఒక పక్క సినిమాలు మరో పక్క ఈవెంట్స్… అలాగే యాంకరింగ్ చేస్తూ చాలా బిజీగా ఉంది. రష్మీ గౌతమ్ ఒక్కో ఈవెంట్ కి 2 నుండి 3 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది.

ప్రేమి విశ్వనాథ్
కార్తిక దీపం సీరియల్ లో వంటలక్కగా ఫేమస్ అయినా ప్రేమి విశ్వనాథ్ రోజుకి 25 వేలు పారితోషికం అందుకుంటుంది

సుహాసిని
ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ నిర్మిస్తున్న సుహాసిని రోజుకి 20 వేల పారితోషకం తీసుకుంటుంది

నవ్య స్వామి
బుల్లితెరలో సీరియల్స్ బిజీగా ఉన్న నవ్య స్వామి రోజుకి 20 వేల పారితోషకం తీసుకుంటుంది

పల్లవి రామిశెట్టి
టివి సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్న పల్లవి రామిశెట్టి రోజుకి 15 వేల పారితోషకం తీసుకుంటుంది

హరిత
హీరోయిన్ రవళి సోదరి. నటుడు జాకీ భార్య, సినిమాలు, సీరియళ్లతో బిజీగా ఉన్న హరిత రోజుకి 12 వేల పారితోషకం తీసుకుంటుంది.