MoviesTollywood news in telugu

వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్లు… ఒక లుక్ వేయండి

Tollywood heroines business Details : టాలీవుడ్ లో మన అభిమాన హీరోయిన్లు ఒక పక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క వ్యాపారాలు చేస్తూ కోట్ల రూపాయిలను సంపాదిస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ వ్యాపారాలతో చాలా ఎక్కువ డబ్బును సంపాదిస్తున్నారు. ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తోంది. సినిమాలతో పాటు ఫిట్నెస్ రంగంలో కూడా రాణిస్తోంది. ఈ భామకు ముంబై, హైదరాబాద్ లాంటి సిటీలలో ఫిట్నెస్ స్టూడియోలు ఉన్నాయి.

తమన్నా ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క జ్యువెలరీ డిజైనర్ వ్యాపారం చేస్తుంది. ఇక సమంతా విషయానికి వస్తే స‌ఖి పేరుతో గార్మెంట్ బ్రాండ్ ను ప్రారంభించి… లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్ వేర్స్ ను అందుబాటులోకి తెచ్చి తనకంటూ ఒక ఇమేజ్ ని వ్యాపార రంగంలో కూడా సాధించింది.

చందమామ భామ కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లు తో కలిసి ఫర్నిచర్ బిజినెస్ ను ప్రారంభించింది. అంతే కాకుండా అత్తారింటికి దారేది సినిమా బ్యూటీ ప్రణీత బెంగళూరులో ఓ స్టార్ హోటల్ ను ప్రారంభించి… హోటల్ రంగంలో రాణిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."