Healthhealth tips in telugu

ఇలా చేస్తే ఎంతటి భరించలేని తలనొప్పి,మైగ్రేన్, సైనస్ 2 నిమిషాల్లో తగ్గిపోతుంది

Migraine headache Home remedies In telugu: తలనొప్పి అనిపించగానే మనలో చాలా మంది మెడికల్ షాప్ కి వెళ్లి మందులు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. తలనొప్పి అనేది మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. అలాగే ఏ పని మీద ఏకాగ్రత ఉండదు.

తలనొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఫోన్ ని ఎక్కువగా వాడటం, కంప్యూటర్ ని ఎక్కువగా చూడటం వంటి కారణాలతో తలనొప్పి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి సైనస్ కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. చలికాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
lemon benefits
మనలో చాలామంది తలనొప్పి రాగానే టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అలా టాబ్లెట్ వేసుకోకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే తలనొప్పి కాస్త తక్కువగా ఉన్నప్పుడే ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి. తలనొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం టాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఈ రెమిడీ కోసం రెండు ఇంగ్రిడియంట్స్ ఉపయోగిస్తున్నాం.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 4 మిరియాలను పొడిగా చేసి వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. తలనొప్పి వచ్చినప్పుడు ఈ డ్రింక్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. మిరియాల పొడి మార్కెట్ లో దొరుకుతుంది. కానీ ఇంటిలోనే మిరియాలను మిక్సీలో వేసి పొడి చేసుకుంటే మంచిది.

మిరియాలు,నిమ్మకాయ తలనొప్పిని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి ఈ ఇంటి చిట్కాను ఫాలో అవ్వండి. తలనొప్పిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఫోన్ కి దూరంగా ఉండాలి. అప్పుడే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాను పాటించటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.