Healthhealth tips in teluguKitchen

1 గ్లాసు ఎంతటి వేలాడే పొట్ట, తొడల చుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Date Belly Fat Tips in telugu: వ్యాయామం చేయకపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం, ఎక్కువ సేపు అలా కూర్చొని ఉండటం వంటి కారణాలతో ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ అయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే కచ్చితంగా అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ డ్రింక్ తాగడం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.
Ginger benefits in telugu
ముందుగా 2 లేదా 3 ఖర్జూరాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి దానిలో ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడెక్కకా ఖర్జూరం,అల్లం ముక్కలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం, చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తూ ఉంటే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
Weight Loss tips in telugu
అంతేకాక ఈ సీజన్ లో వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయం సమయంలో ఈ డ్రింక్ తాగటం వలన అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారు చేసుకుంటే మంచి పలితం పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.