MoviesTollywood news in telugu

Tollywood లో విలన్స్ గా నటించి స్టార్స్ అయినా హీరోలు ఎంతమంది ఉన్నారో తెలుసా ?

Tollywood Villains Turned Heroes :టాలీవుడ్ లో విలన్ నుండి హీరోగా ఎదిగి ఎన్నో హిట్స్ సాధించిన వారు చాలా మంది ఉన్నారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఎందరో నటులు వస్తుంటారు…పోతుంటారు. కానీ తమదైన మార్క్ చూపిస్తారు. కొందరు విలన్స్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోలుగా ఎదిగారు. మరికొందరు హీరోలుగా చేసి, విలన్స్ అవతారం ఎత్తారు.

అయితే విలన్స్ గా చేసి స్టార్ హీరోలుగా ఎదిగి, ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వారిని ప్రస్తావిస్తే,.. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గుర్తొస్తారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ, మోసగాడు, 47రోజులు, సినిమాల్లో విలనిజం పండించి, హీరోగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఖైదీ మూవీతో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. స్వయంకృషితో మెగాస్టార్ అయ్యారు.

నేనంటే నేనే, భలే మాస్టర్ వంటి సినిమాల్లో విలన్ గా చేసి, తర్వాత హీరోగా ఇండస్ట్రీలో నిలబడిన కృష్ణంరాజు రెబెల్ స్టార్ గా ఎదిగారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మొదట్లో విలన్ గానే చేసారు. కథా సంగమం, బాలు, జానూ వంటి మూవీస్ తో కన్నడలో విలన్ గా చేసిన రజనీకాంత్ తమిళ, తెలుగు భాషల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకుని సూపర్ స్టార్ అయ్యారు.

అప్పట్లో అగ్ర హీరోల సరసన విలన్ గా మెప్పించిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు అల్లుడుగారు మూవీతో హీరోగా రేంజ్ పెంచుకుని, ఎన్నో సినిమాలతో కలెక్షన్ కింగ్ అయ్యారు. తలంబ్రాలు మూవీతో విలనిజం పండించి గుర్తింపు తెచ్చుకుని, ఆహుతి, అంకుశం వంటి మూవీస్ తో యాంగ్రీ యంగ్ మ్యాన్ హీరో అయ్యారు.

ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు, అబ్బాయి గారు మూవీస్ లో విలన్ గా రాణించిన శ్రీకాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఇక పెళ్లి సందడి మూవీతో స్టార్ హీరో అయ్యాడు. చక్రవర్తి శివ మూవీలో విలన్ గా చేసి, చిన్న చిన్న పాత్రలతో రాణిస్తూ గులాబీతో హీరో అయ్యాడు. రౌడీ ఇనస్పెక్టర్ , ముఠామేస్త్రి వంటి సినిమాలతో విలనిజం పండించిన శ్రీహరి పోలీస్ సినిమాతో రియల్ హీరోగా మారాడు.

ఇక చిన్న చిన్న క్యారెక్టర్ లతో కెరీర్ స్టార్ట్ చేసి, సముద్రం, సీతారామరాజు వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవితేజ మాస్ మహారాజు గా ఎదిగారు. జయం, నిజం, వర్షం మూవీస్ లో విలనిజం పండించిన గోపీచంద్ తొలివలపు,రణం మూవీస్ తో హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.