Ravi Teja వదిలేసిన 10 సినిమాలు…ఎన్ని హిట్స్ ఉన్నాయో…?
Ravi Teja rejected movies In Telugu : సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ మాస్ మహారాజ్ గా ఎదగడానికి రవితేజకి 12 సంవత్సరాలు పట్టింది. లైట్ మెన్ గా కెరీర్ స్టార్ట్ చేసి,తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా,ఆతరువాత పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ,‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ మూవీస్ తో హీరోగా నిలబడ్డాడు.అయితే రవితేజ అనుకోకుండా కొన్ని సినిమాలను వదులుకోగా,అందులో కొన్ని సూపర్ హిట్లు కొట్టినవి ఉన్నాయి.
వాటి వివరాల్లోకి వెళ్తే,ఆనందం కథను రవితేజకు శ్రీనువైట్ల వినిపించాడు .అయితే ఇట్లు శ్రావణి సుబ్రహమణ్యం సినిమాతో బిజీగా ఉండడం వలన దీనిని వదులు కున్నాడు. ఆర్య మూవీని ప్రభాస్, ఎన్టీఆర్, అల్లరి నరేష్ లతో పాటు రవితేజ కూడా రిజెక్ట్ చేసాడట. ఆ తరువాత బన్నీ వద్దకు వెళ్లి, సూపర్ హిట్ అయింది .
‘ఉత్తమ్ సింగ్’ పేరుతో పోకిరి చిత్రాన్ని రవితేజతో చేద్దామని పూరి జగన్నాధ్ అనుకున్నప్పటికీ వరుస ప్రాజెక్టులతో రవితేజ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పవన్ వద్దకు వెళ్ళి, చివరికి మహేష్ దగ్గరకు చేరి బ్లాక్ బస్టర్ అయింది. గోదావరి మూవీని రవితేజతో చేయాలనీ శేఖర్ కమ్ముల అనుకున్నా, అతడు బిజీగా ఉండడంతో తరువాత సుమంత్ చేసాడు.
కందిరీగ స్టోరీని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ముందు రవితేజకు చెప్పినప్పటికీ అతడు హోల్డ్ లో పెట్టడంతో రామ్ తో చేసి హిట్టు అందుకున్నాడు. అంతెందుకు గబ్బర్ సింగ్ మూవీని హరీష్ శంకర్ మొదట రవితేజతో చెయ్యాలనుకుంటే, పవన్ కళ్యాణ్ ‘దబాంగ్’ రీమేక్ రైట్స్ కొనుగోలు చెయ్యడంతో అలా వెళ్ళింది. జై లవకుశ మూవీ కథను మొదట రవితేజకు దర్శకుడు బాబీ వినిపించాడు. ఖాళీ లేకపోవడంతో రవితేజ ట్రిపుల్ యాక్షన్ ఛాన్స్ పోగొట్టుకున్నాడు.
గోపీచంద్ మలినేని మొదట బాడీగార్డ్ కథను రవితేజతో చెయ్యాలనుకుని,చివరికి వెంకటేష్ తో చేయాల్సి వచ్చింది. అలాగే వేణు శ్రీరామ్ మొదట ఎం.సి.ఎ చిత్రం కథను రవితేజకు చెప్పాడు. పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే ఎక్కడ తేడా వచ్చిందో కానీ, చివరికి నానితో చేసారు. మహా సముద్రం మూవీ మొదట రవితేజ దగ్గరకి రాగా, రిజెక్ట్ చేయడంతో శర్వానంద్ దగ్గరికి చేరింది.