Healthhealth tips in teluguKitchen

అర గ్లాసు-పొట్టలో నొప్పి,గ్యాస్,ఎసిడిటీ నిమిషంలో తగ్గుతుంది.. మళ్ళీ జన్మలో రాదు

Gas problem home Remedies in telugu : ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవటం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, మసాలా ఆహారాలను ఎక్కువగా తినటం వలన ఈ మధ్య కాలంలో గ్యాస్ సమస్య ఎక్కువగా వస్తుంది. గ్యాస్ సమస్య అనేది వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉండటమే కాకుండా తొందరగా తగ్గదు.
gas troble home remedies
గ్యాస్ సమస్య రాగానే మనలో చాలా మంది మందులు వేసుకుంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. దీని కోసం ఉపయోగించే అన్నీ ఇంగ్రిడియన్స్ ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. అరస్పూన్ ధనియాలు, అరస్పూన్ జీలకర్ర, అరస్పూన్ సొంపు,3 మిరియాలు, చిన్న అల్లం ముక్కలను కొంచెం దంచుకొని పక్కన పెట్టాలి.
dhaniyalu
మరి మెత్తగా చేయవలసిన అవసరం లేదు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో తయారుచేసుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగాక గ్లాస్ లో వడకట్టి తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం అరగ్లాస్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.
jeelakarra Health Benefits in telugu
ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా 3 రోజులు తాగితే గ్యాస్ సమస్య నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచనల ప్రకారం ఫాలో అవుతూ ఇంటి చిట్కా పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
sompu
ఈ డ్రింక్ తాగటం వలన గ్యాస్ సమస్య తగ్గటమే కాకుండా అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. అంతేకాకుండా డయబెటిస్ ఉన్నవారికి కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ఈ డ్రింక్ ని తాగటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.