MoviesTollywood news in telugu

Allu arjun కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్ని ఉన్నాయో చూడండి

Allu Arjun Best Movies :అల్లు అర్జున్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి అల్లు వారి అబ్బాయిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆల వైకుంఠపురంలో ఘనవిజయం తరువాత అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటించి హిట్ కొట్టాడు.

ముఖ్యంగా అల్లు అర్జున్ ను ఇప్పటివరకు స్టైలిష్ స్టార్ గా పిలుస్తున్న ఫాన్స్ పుష్ప సినిమా నుంచి ఐకాన్ స్టార్ గా వర్ణిస్తున్నారు. బన్నీ కెరీర్లో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సరైనోడు నెగిటివ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక రెండు షేడ్స్ లో నటించిన డిజే సినిమా కమర్షియల్ గా హిట్ కొట్టి, 115 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు 90 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన రేసుగుర్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించి, నటుడిగా బన్నీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో అన్ని వర్గాలను ఆకట్టుకుని, 2020లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ అనూహ్యంగా పెంచుకున్నాడు.