MoviesTollywood news in telugu

ఈ నలుగురు హీరోలు ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసారో తెలుసా?

Tollywood heroes: Telugu సినీ పరిశ్రమలో సమకాలికులు అక్కినేని,ఎన్టీఆర్ అలాగే శోభన్ బాబు,కృష్ణ,కృష్ణంరాజు ఆతర్వాత చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ అని తెలుసు కదా. వీళ్ళలో ఎవరి తరహాలో వాళ్ళు తమ ఇమేజ్ ని కాపాడుకుంటూ ఎన్నో హిట్స్ అందుకున్నారు. ఇక చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ ల విషయానికి వస్తే వీళ్ళు ఎన్నో ట్రెండ్స్ క్రియేట్ చేసారు.
Chiranjeevi Dance Skills
ఎన్టీఆర్ తరువాత పెద్ద పెద్ద కమర్షియల్ హిట్స్ ఇచ్చిన ఘనత చిరంజీవికి దక్కుతుంది. హిట్ మీద హిట్ కొడుతూ పాతికేళ్ళపాటు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అయ్యాడు. తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటే చిరంజీవి అన్నంతగా డాన్స్ లతో అతడి పేరు మారుమోగిపోయింది. ఈ విషయంలో ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కితాబిచ్చారు. చిరు క్రియేట్ చేసిన ఈ ట్రెండ్ ని జూనియర్ ఎన్టీఆర్,బన్నీ,రామ్ చరణ్ తదితరులు ఫాలో అవుతున్నారు.
Bala krishna Movies
ఇక బాలకృష్ణ విషయం తీసుకుంటే, తెరవెనుక పెద్దగా మాట్లాడలేడు. కానీ తెరమీద డైలాగ్ లతో దుమ్మురేపగలడు. పవర్ ఫుల్ డైలాగ్ కి కేరాఫ్ ఎడ్రెస్ అయ్యాడు. చిరంజీవితో పోటీ పడి డాన్స్ చేసేవాడు. అయితే ప్రత్యేకంగా డైలాగు లపై దృష్టిపెట్టి డైలాగ్ కింగ్ గా రూపాంతరం చెందాడు. ఇక ఫ్యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అయ్యాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ లు ఫ్యాక్షన్ నేపధ్యమని చెప్పాలి. దాంతో ఇంద్ర అంటూ చిరంజీవి కూడా ఫ్యాక్షన్ బాట పట్టాల్సి వచ్చింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పట్టుబట్టి రాయించుకున్న అరవింద సమేత కూడా ఫ్యాక్షన్ నేపధ్యమే. అంతకు ముందు ఆది కూడా అదే కోవలోకి వచ్చిన సినిమాయే. అలా ఫ్యాక్షన్ ట్రెండ్ బాలయ్య సొంతం అయింది.
Bigg Boss 5 Telugu Nagarjuna
మాన్ ఆఫ్ స్టైల్స్ కి కేరాఫ్ నాగార్జున అని చెప్పాలి. శివ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ నేషనల్ లెవెల్ కి వెళ్ళింది. శివ ముందు శివ తర్వాత అనేలా సినిమా ట్రెండ్ నాగార్జున క్రియేట్ చేసి,సెట్ చేసాడు. అంతేకాదు కొత్త సినిమాలను ,కొత్త స్క్రిప్ట్ లను ఎంకరేజ్ చేయడం అనేది నాగ్ తోనే స్టార్ట్ అయింది. సినిమాలు ప్లాప్ అయినా సరే,కొత్త రచయితలను,దర్శకులను పరిచయం చేస్తూ తన ట్రెండ్ ని కొనసాగిస్తున్నాడు. ఇక ఓ దశలో నాగ్ కి లేడీ ఫాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. శోభన్ బాబు తర్వాత నాగార్జునకు లేడీ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Venkatesh
కాగా వెంకటేష్ నిర్మాత కుటుంబం నుంచి హీరోగా తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. ఫామిలీ చిత్రాల రారాజు గా వెలిగాడు. కుటుంబ కథా చిత్రాలంటే దర్శక రచయితలకు మొదటగా వెంకీ పేరే గుర్తొస్తుంది. అందరి హీరోల మెప్పు  పొందిన వాడు కూడా వెంకీయే. చదుకున్నవాడు, క్రీడలంటే అభిమానించే వెంకటేష్ వెరైటీ డ్రెస్ సెన్స్ విషయంలో వెంకీ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఇక సిక్స్ పాక్ మెయింటేన్ చేసిన వాళ్లలో విక్టరీ వెంకటేష్ తొలిస్థానంలో ఉంటాడు.