5 గింజలు-అధిక బరువు,డయాబెటిస్ , రక్తపోటు,జీర్ణ సమస్యలు జీవితంలో లేకుండా చేస్తుంది

Black Pepper Health Benefits In telugu :మీ వంటింట్లో పోపుల పెట్టెలో ఉండే మిరియాలు గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు భారత దేశంలో అత్యధికంగా పండే మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియం అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పిచెస్ అన్నారు. పైపరేసి కుటుంబంలో పైపర్ ప్రజాతికి చెందినవి.

మిరియాలను ప్రాచీనకాలం నుండి భారతదేశంలో మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. ఘాటుగా ఉండే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.
gas troble home remedies
మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే మిరియాలకు సుగంధ ద్రవ్యాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మిరియాల్లో కేవలం నల్లవే కాకుండా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తాయి. మిరియాలలో విటమిన్ ఎ, సి, కెరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో ఉండే హానికారక ప్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి.
Weight Loss tips in telugu
మిరియాలు తరచుగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సరే కాదు చర్మ, పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుందని కొన్ని పరిశోధనలలో తేలింది. మిరియాల పైపొరలో ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని విచ్ఛిన్నం చేసి శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతాయి.
cholesterol
బరువు పెరగకుండా చూడటమే కాకుండా రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి కూడా కాపాడుతాయి. కాబట్టి మిరియాలు తీసుకోవడం వల్లే ఆరోగ్యమే కాదు.. ఫిట్ గానూ ఉండవచ్చు. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణముగా ఒత్తిడి,ఆందోళన పెరిపోతున్నాయి. మిరియాలలో ఉండే పైపెరైన్ అనే లక్షణం ఒత్తిడి,ఆందోళలన తగ్గిస్తుంది.

మిరియాల్లో సమృద్ధిగా ఉండే పెపెరైన్ అనే ఆల్కలాయిడ్ జీర్ణవ్యవస్థలో ఎక్కువ మొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలోని ప్రొటీన్లు సులభంగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్, విరేచనాల వంటి సమస్యలు తగ్గిపోతాయి.