Nani కి నిద్ర లేకుండా చేసిన సినిమా ఏమిటో తెలుసా?
Nani Bheemili Kabaddi Jattu Movie in Telugu :ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి,అష్టా చెమ్మా మూవీతో హీరోగా మారి,స్వయం కృషితో నేచురల్ స్టార్ గా ఎదిగిన హీరో నాని.వరుస హిట్స్ తో స్టార్ డమ్ తెచ్చుకున్న నాని, బిగ్ బాస్ రియాల్టీ షోకి హోస్ట్ గా కూడా వ్యవహరించి తనదైన ముద్ర వేసాడు. అయితే కొన్ని ప్లాప్ లు కూడా చూసిన నాని కి ఓ సినిమా అసలు నిద్రలేకుండా చేసిందట.
నాని,శరణ్య మోహన్ జంటగా తాతినేని సత్య డైరెక్షన్ లో వచ్చిన బీమిలి కబడీ జట్టు మూవీ 2010జులై 10న రిలీజ్ అయింది.అష్టా చెమ్మా మూవీతో హిట్ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వచ్చాయి. అనుకున్నట్టుగానే మంచి ఓపెనింగ్స్ తెచ్చింది. పైగా తక్కువ బడ్జెట్ మూవీ కనుక బయ్యర్లకు ఎలాంటి నష్టం కూడా వాటిల్లలేదు.
అయితే కొన్నిచోట్ల రెండు మూడు వారాలకే థియేటర్ల నుంచి ఈ సినిమాను తీసేసారు. హీరో చివరిలో చనిపోవడంతో నెగెటివ్ టాక్ వచ్చింది. హిట్ అవుతుందని చనిపోయే సీన్ కి నాని ఒప్పుకున్నాడట. కానీ సీన్ రివర్స్ అయింది. నాని మనోవేదనకు గురై,నిద్ర లేని రాత్రుళ్ళు గడిపాడట. రివ్యూస్ బాగున్నా బాడ్ ప్రచారం సాగింది.