MoviesTollywood news in telugu

Robo సినిమాలో విలన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో…?

Rajnikanth Robo movie :డైరెక్టర్ శంకర్,తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ అంటే తమిళనాట మాత్రమే కాదు, టాలీవుడ్ లో కూడా క్రేజ్ గల కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన రోబో మూవీ ఓ సంచలనం. ఇందులో రోబో పాత్రలో, శాస్త్రవేత్త పాత్రలో రజనీకాంత్ నటన అద్భుతం. ఇక ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇందులో విలన్ గా డ్యాన్ నటించాడు.

అయితే నిజానికి రోబో మూవీలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరుని పరిశీలనలోకి తీసుకోవాలని డైరెక్టర్ శంకర్ భావించారట. అయితే అమితాబ్ చేస్తే బాగోదని రజనీకాంత్ చెప్పడంతో శంకర్ వెనక్కి తగ్గాడట. ఇదిలా ఉంటె 2.ఓ లో కూడా అమితాబ్ విలన్ గా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అక్షయ్ కుమార్ చేసాడు.

అయితే అమితాబ్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ రోబో మూవీ లో విలన్ పాత్ర చేయాలని డైరెక్టర్ శంకర్ సంప్రదించగా, రజనీ స్వయంగా తనకు ఫోన్ చేసి,మీలాంటి వ్యక్తి విలన్ గా చేస్తే జనం రిసీవ్ చేసుకోలేరని,ఒప్పుకోవద్దని చెప్పేశారని, దాంతో నో చెప్పానని వివరించారు. అయితే 2.ఓ కి మాత్రం తనను సంప్రదించలేదని కూడా అమితాబ్ స్పష్టం చేసారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."