Healthhealth tips in teluguKitchen

షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఖర్జూరాలు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం అవుతుందో తెలుసా..

Date For Diabetes In telugu : డయాబెటిస్ ఉన్నవారిలో ఆహారం విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి.డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకుందాం.
Diabetes In Telugu
ఖర్జూరంలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. చాలా మంది ఖర్జూరంను చాలా ఇష్టంగా తింటారు. డయాబెటిస్ ఉన్నవారు మితంగా తింటేనే మంచిది. ఖర్జూరంలో డైటరీ ఫైబర్ మరియు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు విటమిన్లు ఎ, కె మరియు బి-కాంప్లెక్స్ విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి.
Health Benefits of Dates
ఖర్జూరం తియ్యగా మరియు కొలెస్ట్రాల్ లేకుండా, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి ఖర్జూరం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు. ఖర్జూరంలోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వాపును తగ్గించటమే కాకుండా అధిక బరువు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఖర్జూరంలో మెగ్నీషియం మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ 2 లేదా 3 ఖర్జూరాలు తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరంలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Diabetes diet in telugu
అయితే డయాబెటిస్ ఉన్నవారు రోజుకి ఎన్ని ఖర్జూరాలు తినవచ్చో అనే సందేహం ఉంటుంది. రోజుకి రెండు లేదా మూడు ఖర్జూరాలు మాత్రమే తినాలి. ఏదైనా లిమిట్ గా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఖర్జూరం తినటం వలన అలసట,నీరసం లేకుండా హుషారుగా చురుకుగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.