MoviesTollywood news in telugu

Mithai Kottu Chittemma సీరియల్ కాంతమ్మ లైఫ్ స్టైల్…అసలు నమ్మలేరు

Mithai Kottu Chittemma TV Serial Online:Zee Telugu లో ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. ప్రతి రోజు వచ్చే సీరియల్స్ లో టాప్ సీరియల్ గా నడుస్తున్న మిఠాయి కొట్టు చిట్టెమ్మ సీరియల్ లో కాకినాడ కాంతమ్మ పాత్రలో అదరగొడుతున్న ఈమె పేరు అనూషారావు. కర్ణాటకలోని బెంగుళూరులో నవంబర్ 5న జన్మించిన ఈమెకు అను,కాంతమ్మ అనే నిక్ నేమ్స్ ఉన్నాయి.

చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి గల ఈమె నాలుగేళ్ల వయస్సు నుంచే భరతనాట్యం,కథాకళి నేర్చుకుంది. స్టడీస్ పూర్తయ్యాక బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, కన్నడంలో అగ్నిసాక్షి, మణిమంత్రాలయ,సుబ్బలక్ష్మి,దుర్గ వంటి సీరియల్స్ లో నటించింది. కన్నడ సినిమాల్లో కూడా ఈమె నటించింది. 2012లో మనోహర్ అనే వ్యక్తితో అనూషారావు కి పెళ్లయింది. ఈయన డీవోపీ గా పనిచేస్తున్నారు. ఈమెకు ఒక బ్రదర్,ఒక సిస్టర్ ఉన్నారు. ఈమె 5అడుగుల 6అంగుళాల ఎత్తు,65కిలోల బరువు ఉంటుంది.

వైట్,పింక్ కలర్స్ అంటే అనూషారావుకి ఇష్టం. ఖరీదైన,కారు,బైక్ ఉన్నాయి. ఈమె ఖరీదైన ఇంట్లోనే నివాసం ఉంటోంది. ఒక్కొక్క ఎపిసోడ్ కి 16వేల వరకు అందుకుంటుంది. ఇక మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన అనూషారావు ప్రస్తుతం మిఠాయి కొట్టు చిట్టెమ్మ సీరియల్ లో కాకినాడ కాంతమ్మ గా నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈమె యాక్టర్ గా,డాన్సర్ గా పాపులర్ అయింది.