Healthhealth tips in teluguKitchen

యూరిక్ యాసిడ్ ఉన్నవారు బంగాళాదుంప తింటే ఏమి అవుతుందో తెలుసా?

Uric acid Foods In telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది Uric acid సమస్యతో బాధపడుతున్నారు. మన శరీరంలోని రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. దీనినే గౌట్ అంటారు. గౌట్ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా పాటించాలి. ఈ సమస్య ఉన్నప్పుడూ డాక్టర్ సూచనలను పాటిస్తూ యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉండే ఆహారాలను తీసుకోవాలి.
uric acid
యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ అయితే ఆ ప్రభావం కిడ్నీల మీద పడుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు కీళ్లలో,కణజాలల్లో నిక్షిప్తం అయ్యి వాపులు వచ్చి నడవటానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే రక్తపోటు స్థాయిలలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి.ప్యూరీన్స్‌ తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు బంగాళాదుంప తినవచ్చు.

బంగాళాదుంపలు సంతృప్తికరమైన, తక్కువ ప్యూరిన్ ఆహారం , ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది , ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. చాలా మంది బంగాళాదుంప తినకూడదు అనే అపోహలో ఉంటారు. బంగాళాదుంపలలో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి.వీటిని తక్కువ మోతాదులో తీసుకున్న సరే కడుపు నిండిన భావన కలుగుతుంది. బంగాళాదుంపలో ప్యూరిన్ చాలా తక్కువ ఉంటాయి.
Potato
బంగాళాదుంపలు తినడం వల్ల ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉంటాయి. అయితే బంగాళాదుంపను వేపుడుగా కాకుండా ఉడికించి తీసుకోవటం మంచిది. లేదంటే బంగాళాదుంప రసం తీసుకోవచ్చు. రక్తప్రసరణ మెరుగుపరచి నొప్పుల నుండి ఉపశమనం కలగటానికి సహాయపడుతుంది. వారంలో రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది.
Joint pains in telugu
గౌట్ మంట వల్ల కలిగే తీవ్రమైన నొప్పి కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది, కాలి బొటనవేలు తాకడం కూడా గణనీయమైన బాధను కలిగిస్తుంది. ఈ బాధను తగ్గించటంలో బంగాళాదుంప సహాయపడుతుంది. ఇటువంటి ఆహారాలను తింటూ…మంచినీరు ఎక్కువగా తాగాలి. కనీసం రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అప్పుడే యూరిక్ ఆసిడ్ కంట్రోల్ అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.