Healthhealth tips in teluguKitchen

1 Spoon గింజలను ఇలా తీసుకుంటే కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేవి జీవితంలో ఉండవు

Joint Pains Home Remedies In telugu: ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు వంటి అనేక రకాల కారణాలతో మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి, ఒకప్పుడు 60 సంవత్సరాల వయసులో వచ్చే కీళ్ల నొప్పులు… ఇప్పటి రోజుల్లో 30 సంవత్సరాల లోపే వచ్చేస్తున్నాయి.

కొన్ని ఆహారాలను తీసుకుని నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. కాబూలీ శనగలు మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఒకప్పుడు కాబూలీ శనగలు అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు చాలా విరివిగా లభిస్తున్నాయి. కాబూలీ శనగలను వేగించి మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.

ఈ పొడిని ఒక బాక్స్ లో పోసి నిలువ చేసుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలల్లో అర స్పూన్ తయారుచేసి పెట్టుకున్న కాబూలీ శనగల పొడి, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పాలను ఉదయం సమయంలో తాగితే ఎముకల బలహీనత తగ్గి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
Honey benefits in telugu
ఈ పాలల్లో ఉన్న పోషకాలు ఎముకలు పెళుసుగా మారకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Joint Pains
ఈ మధ్యకాలంలో మనలో చాలామంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ప్రోటీన్ లోపం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. అలాంటి వారికి ఉదయం సమయంలో ఈ పాలను ఇస్తే ప్రోటీన్ శరీరానికి సమృద్ధిగా అందుతుంది. అంతేకాకుండా అలసట, నీరసం వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.