MoviesTollywood news in telugu

Anchor Ravi మొదటి పారితోషికం ఎంతో తెలుసా…?

Anchor Ravi First remuneration : ఫీమేల్ యాంకర్స్ లో సుమ ఎంతటి పాపులార్టీ తెచ్చుకుందో మేల్ యాంకర్స్ లో రవి కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. 2010లో మా మ్యూజిక్ టీవీలో లవ్ జంక్షన్ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రవి ఆతర్వాత వరుస షోస్ తో బిజీ అయ్యాడు. ఈమధ్య ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ, తొలిసారి లైవ్ షోలో ఎపిసోడ్ కి 250రూపాయలు తొలి పారితోషికంగా అందుకున్నానని చెప్పాడు.

క్రికెటర్ అవ్వాలని కోరుకున్నప్పటికీ కాలేకపోయానని యాంకర్ రవి చెప్పాడు. అయితే రవితో పాటు అతడి భార్య నిత్యా సక్సేనా, కూతురు లియాతో కల్సి యూట్యూబ్ లో సందడి చేసిన ఇంటర్యూ వైరల్ అయింది. సొంత యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో షేర్ చేయడంతో బాగా చక్కర్లు కొడుతోంది. లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

ఒక్కో ఎపిసోడ్ కి 250చొప్పున నెలలో ఎన్ని ఎపిసోడ్స్ చేస్తే,అన్ని 250లు వచ్చేవని యాంకర్ రవి గుర్తుచేసుకున్నాడు. ఇక తన భార్య నిత్యా బిటెక్ థర్డ్ ఈయిర్ లోనే ఇన్ఫోసిస్ లో జాబ్ తెచ్చుకుందని చెప్పాడు. అప్పట్లో నిత్యా నెలకు 22వేల 500సంపాదించేదని యాంకర్ రవి చెప్పాడు. తన భర్త తన దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండాలని కోరుకుంటానని నిత్యా చెప్పుకొచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."