రోజుకి 1 లడ్డు తింటే నరాల బలహీనత, ఎముకల బలహీనత, అలసట,నీరసం అనేవి ఉండవు

Powerful Laddu to Reduce Nerves Weakness : ఈ లడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. నరాల బలహీనత లేకుండా కండరాలు బలంగా ఉండటానికి మరియు శరీరానికి ప్రోటీన్ సమృద్దిగా అందటానికి ఒక లడ్డు తయారుచేసుకుందాం. ఈ లడ్డులో బెల్లం ఉపయోగించటం లేదు. ఒక పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి 100 గ్రాముల ఎండు ద్రాక్షను వేయించి పక్కన పెట్టుకోవాలి.
minumulu
ఆ తర్వాత 100 గ్రాముల ఖర్జూరం తీసుకొని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాన్ లో వేసి జిగురు వచ్చేవరకు వేగించాలి. ఆ తర్వాత 100 గ్రాముల నల్ల మినపప్పును వెగించి పొడి చేసుకొని ఒక బౌల్ లో వేయాలి. ఆ తర్వాత 50 గ్రాముల తవుడు, 50 గ్రాముల వేగించిన కొబ్బరి తురుము వేయాలి.

ఆ తర్వాత ఎండు ద్రాక్ష,ఖర్జూరం, వేగించిన బాదం,జీడిపప్పు ముక్కలు. పావు స్పూన్ యాలకుల పొడి వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోవాలి. ప్రతి రోజు ఒక లడ్డు తింటే అధిక మొత్తంలో ప్రోటీన్ మరియు ఫైబర్‌ మన శరీరానికి అందుతాయి. ఈ లడ్డు కండరాల నిర్మాణానికి మరియు హార్మోన్ ఉత్పత్తికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Health Benefits of Dates
దీనిలో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలకు మరియు ప్రేగులను శుభ్రపరచడానికి మంచిది. ఈ లడ్డు తయారీకి తీసుకున్న తవుడులో అధిక మొత్తంలో B-కాంప్లెక్స్, రిబోఫ్లావిన్, B1, B2, B3, B6 ఉంటాయి. నరాలలో బలం, శక్తి విడుదల మరియు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ లడ్డు పోషకాహార లోపం లేకుండా చేస్తుంది.

పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉండుట వలన మెదడు అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందించి అల్జీమర్స్ మరియు మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది. ఇది జీర్ణక్రియ మరియు కాలేయ నిర్విషీకరణను మెరుగుపరుస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు రోజుకి ఒక లడ్డు తినవచ్చు. అలసట,నీరసం,నిస్సత్తువ వంటి వాటిని తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.