MoviesTollywood news in telugu

Pradeep 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్

Pradeep 30 rojullo preiminchadam ela : హీరోలే కాదు,హీరోయిన్స్ కూడా కొన్ని హిట్ సినిమాలను కాదనుకున్న ఘటనలున్నాయి. వివిధ కారణాలతో వదిలేసుకున్న సినిమాలు వేరేవాళ్లు చేసి హిట్ అయితే కొంచెం బాధగానే ఉంటుంది.

ఫణి ప్రదీప్ డైరెక్షన్ లో వచ్చిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ భారీ కలెక్షన్స్ సాధించింది. ఇందులో యాంకర్ ప్రదీప్ , అమృతా అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఇందులో నీలి నీలి ఆకాశం సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు మంచి హైప్ రావడంతో సినిమాపై అంచనాలు పెంచేసింది. థియేటర్లలో బాగానే రెస్పాన్స్ రాగా, అమెజాన్ ప్రయిమ్ లో రిలీజై మంచి వ్యూస్ రాబట్టింది.

అయితే మొదటగా ఈ మూవీలో హీరోయిన్ గా సమంతకు ఛాన్స్ వచ్చిందని, కొన్ని కారణాల వలన రిజెక్ట్ చేసిందని అంటున్నారు. ఈ సినిమా కథను సమంత మేనేజర్ కి వినిపించగా అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడని, సమంతకు కూడా బాగా నచ్చిందని అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నటించలేదని ఇటీవల ఓ ఇంటర్యూలో డైరెక్టర్ ఫణి ప్రదీప్ చెప్పాడు. సమంత ఒప్పుకుంటే మరో హీరో కోసం ప్రయత్నం చేసేవాడినని అన్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."