MoviesTollywood news in telugu

Rajinikanth మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Super Star Rajinikanth First remuneration :కె.బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ‘అంతులేని కథ’ మూవీలో రజనీకాంత్ త్రాగుబోతు పాత్రలో నటించి మెప్పించారు. కమల్ హాసన్ కూడా నటించారు. రజనీకాంత్ కు వెయ్యి రూపాయలు, కమల్ హాసన్ కు 1,500 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట.

అంతులేని కథ సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. అలా ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ ఇక ఆతర్వాత అటు తమిళ భాషతో పాటు తెలుగు భాషలో కూడా నటుడిగా ఉన్నతస్థాయికి ఎదిగి, సూపర్ స్టార్ అయ్యాడు. ముందు రాజకీయాల్లోకి వస్తానని చెప్పి, ఆతర్వాత ఇక రాజకీయా లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

కాగా దక్షిణాదినే కాకుండా ఇతర దేశాల్లో కూడా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్ 70 ఏళ్ళ వయస్సు దాటినా కూడా రజనీకాంత్ నటనకు దూరం కాలేదు. మొదటి సినిమాతోనే తెలుగువారికి పరిచయం అయిన రజనీకాంత్ వరుసగా తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేస్తూ,రావడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు కూడా ప్రకటించింది.