ఈ నాలుగింటిలో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు …ఇది నిజం
Home Remedies In Telugu : మన వంటింటిలో ఉండే ఎన్నో వస్తువులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ రోజు వాము, సొంపు, షాజీరా, జీలకర్ర గురించి తెలుసుకుందాం. వీటిల్లో ఉన్న ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీటిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.

వాము
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పరచటానికి సహాయపడుతుంది. గ్యాస్,అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించటమే కాకుండా కడుపు నొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. పావు స్పూన్ వాములో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే అన్నీ సమస్యలు తొలగిపోతాయి. వాము శరీరంలో కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.

సొంపు
మనలో చాలా మంది సొంపును భోజనం అయ్యాక తింటూ ఉంటారు. సొంపులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గించటానికి సహాయ పడుతుంది. సోంపూ వయసుతో పాటు వచ్చే వృద్దాప్యాన్ని, మెనోపాజ్‌లో తలెత్తే సమస్యల్ని తగ్గిస్తుంది. సొంపులో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోదక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

షాజీర
షాజీరను ఎక్కువగా మసాలా వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అజీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. ఆకలి లేనివారిలో ఆకలిని పుట్టిస్తుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

జీలకర్ర
జీలకర్రను ప్రతి రోజు కూరల తాళింపులో వేస్తూ ఉంటాం. జీలకర్ర శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. జీలకర్ర అసిడిటీ, గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. అందువల్ల కడుపునొప్పి కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

