Healthhealth tips in telugu

ఈ గింజలతో ఇలా చేస్తే పైల్స్ శాశ్వతంగా మాయం అవుతాయి…ఇది నిజం

Piles Home Remedies : వేప చెట్టులో వేపాకు,వేప బెరడు,వేప కాయలు ఇలా అన్ని మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రోజు వేప గింజల గురించి తెలుసుకుందాం. పల్లెటూర్లలో వేప చెట్టు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వేప చెట్టుకి కాయలు కాసినప్పుడు అవి బాగా పండాక కోసి దానిలో ఉన్న గింజలను తీసి ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వచేసుకోవాలి.

వేపచెట్టు లేనివారు ఆయుర్వేదం షాప్ లలో లభ్యం అయ్యే వేప గింజల పొడిని తెచ్చుకొని వాడవచ్చు. వేప గింజలను నెలకు ఒకసారి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వేప గింజలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండుట వలన ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా చాల మంది పైల్స్ బారిన పడుతున్నారు.
piles home remedies
పది మందిలో ఒకరు ఈ పైల్స్ సమస్యతో ఎదో ఒక సమయంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ పైల్స్ అనేవి వయస్సుతో సంబంధం లేకుండా అడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. పైల్స్ సమస్యకు ఇంగ్లీష్ మందులు వాడిన తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలుగుతుంది.
Piles Fruits
అదే ఆయుర్వేదం వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేదంలో వేప గింజలను ఎక్కువగా వాడతారు. వేప గింజలను పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిలో ఆవునెయ్యి కలిపి పేస్ట్ గా చేసి పైల్స్ ఉన్న ప్రదేశంలో పై పూతగా రాయాలి.ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటె మంచి ఫలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.