ఈ “ఆకు”తో మోకాళ్ళ నొప్పులు 10 నిమిషాల్లో తగ్గుతాయి…జీవితంలో మళ్ళీ రావు
Eucalyptus oil benefits : మనలో చాలా మంది యూకలిప్టస్ చెట్టును చూసే ఉంటారు. ఈ చెట్టు ఆకులను నలిపితే జండు బామ్ మాదిరిగా ఘాటైన వాసన వస్తుంది. యూకలిప్టస్ చెట్టు ఆకులను ఎండబెట్టి పొడి చేసి దాంతో నూనెను తయారుచేస్తారు. ఈ నూనె నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయ పడుతుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ నూనె మార్కెట్ లో లభ్యం అవుతుంది.
యూకలిప్టస్ ఆయిల్ కీళ్ల నొప్పులను, మోకాళ్ళ నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. నొప్పులు ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాశి సున్నితంగా మసాజ్ చేస్తే పది నిమిషాల్లోనే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇటువంటి నూనెలు బాగా ఉపయోగపడతాయి.
అదే నొప్పులు ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే చాలా తొందరగా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. నడుము నొప్పి, కండరాల నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది.
యూకలిప్టస్‌లోని అనేక సమ్మేళనాలు మంట, వాపు మరియు నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాక యూకలిప్టస్ ఆయిల్ ను ఛాతి, గొంతుకు రాసి మర్దనా చేయడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి. దగ్గు తగ్గుతుంది. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. యూకలిప్టస్ ఆయిల్‌ను వాసన చూసినా ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.