Dry fruits తినటానికి ముందు ఎన్ని గంటలు నానబెట్టాలో తెలుసా ?
Soaked Nuts : ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూట్స్ ని ప్రతి ఒక్కరూ తినటం అలవాటుగా చేసుకున్నారు. మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద పెడుతున్నారు. నట్స్ అనేవి మనకు పోషకాలను అందించటంతో పాటు రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటూ ఉంటారు.

అయితే మనలో చాలా మందికి నట్స్ ని ఎన్ని గంటలు నానబెట్టి తినాలో అనే సందేహం ఉంటుంది. నాట్స్ ని చల్లని నీటిలో కన్నా వేడి నీటిలో నానబెడితే వాటి మీద ఉన్న పొట్టు సులభంగా వస్తుంది. అలాగే ఆ నీటిలో కాస్త ఉప్పు వేస్తే అందులో ఉండే ఎంజైమ్ లు తటస్ధీకరించబడతాయి. దుమ్ము, దూళీ వంటి హాని కరమైన అవశేషాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది.

కొన్ని నట్స్ ని ఎక్కువ సమయం నానబెట్టాలి. మరి కొన్నింటిని తక్కువ సమయం నానబెడితే సరిపోతుంది. ఆయా నట్స్ స్వభావాన్ని, గట్టితనాన్ని బట్టి నానబెట్టే సమయం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటేనే వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి. వాల్ నట్స్ ను 8 గంటలపాటు నీటిలో నానబెట్టాలి.

అలాగే బాదం ను 12 గంటలు, గుమ్మడి గింజలు 7 గంటలు, జీడిపప్పు 6 గంటలు, అవిసె గింజలు 6గంటలు, బ్రోకలీ గింజలు 8 గంటలు, శనగలు 8 గంటలు, వేరుశనగ గింజలు 7 గంటలు వరకు నానబెట్టాలి. వాల్ నట్స్ లో ఫైటిక్ రసాయనాలు ఉంటాయి. వీటిని నానబెడితే ఫైటిక్ రసాయనాలు తొలగిపోతాయి. ఫైటిక్ రసాయనాలు ఉన్న నట్స్ జీర్ణం కావటం కష్టతరంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

