ప్రతి రోజు ఉదయం అరటిపండుతో పెరుగు కలిపి తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Banana and curd Benefits : అరటి పండు, పెరుగు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ విడిగా కాకుండా కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. అరటి పండులో ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. అదేవిధంగా పెరుగులో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా సమృద్దిగా లభిస్తుంది.
అరటి పండు, పెరుగు కలిసినప్పుడు మన శరీరానికి అవసరమైన క్యాల్షియంను అందిస్తుంది.అందువల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండి ఎముకలకు సంబందించిన అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఉదయం సమయంలో తీసుకోవటం వలన రోజంతా చురుకుగా ఉంటారు.
నీరసం,నిసత్తువ, అలసట వంటివి ఏమి ఉండవు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అరటిపండు,పెరుగు కలిపి తీసు కోవటం వలన ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా ఉండటం వలన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
ఈ క్రమంలోనే వ్యాధికారక బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అవ్వగానే వాటి పై దాడి చేయడానికి ప్రో బయాటిక్ బ్యాక్టీరియా సహాయపడుతుంది. మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. పెరుగు అరటిపండు కలిపిన బ్యాక్టీరియా మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఉదయం సమయంలో తినటం కుదరని వారు సాయంత్రం సమయంలోనైనా తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.