Healthhealth tips in telugu

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

Wall Sit exercise Benefits :చిన్నతనంలో ఏదైనా తప్పు చేస్తే గోడ కుర్చీ వేయమని పనిష్మెంట్ ఇచ్చేవారు. మనలో చాలా మందికి ఈ అనుభవం ఉంటుంది. అయితే రోజుకి 5 నిముషాలు గోడ కుర్చీ వేస్తె ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. గోడకు ఆనుకుని కూర్చునే గోడ కుర్చీలో ఓర్పును పెంచే గుణం ఉంటుందట.

Wall Sit exercise Benefits
wall sit exercise

రోజుకు అయిదు నిమిషాలు గోడ కుర్చీ పొజిషన్ లో కూర్చుంటే మానసిక శక్తి అభివృద్ధి చెంది దైర్యం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి ప్రశాంతత పెరిగి పనుల మీద శ్రద్ద మరియు పోకస్ పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగి ఆలోచనాశక్తి పెరుగుతుంది. గోడకుర్చీ వేస్తే బరువు కూడా తగ్గుతారు.
Weight Loss tips in telugu
ప్రతి రోజు గోడ కుర్చీ వేయటం వలన పొట్ట వద్ద ఉండే కండరాలు దృడంగా మారి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు క్రమంగా కరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. అలాగే వెన్ను నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

కాళ్ళల్లో ఉండే కండరాలు దృడంగా మారి పిక్కలు గట్టి పడి నొప్పులు లేకుండా చేస్తుంది. శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. శరీరంలోని కండరాల పటుత్వానికి, శక్తికి కూడా గోడ కుర్చీ చాలా మేలు చేస్తుంది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించిన ఆ తరవాత బాగా అలవాటు అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.