MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో అలనాటి ఫేమస్ జోడీలు ఎవరో చూడండి

Best onscreen couples of Tollywood:ఇప్పుడంటే ఒకటి రెండు సినిమాలతో హీరోయిన్స్ ని మార్చేస్తున్నారు గానీ, ఒకప్పుడు డజన్ల కొద్దీ ఇంకా చెప్పాలంటే పాతికకు పైగా కల్సి నటించి, హిట్ ఫెయిర్ గా నిల్చిన జంటలున్నాయి. గతంలో ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ కి జనం నీరాజనం పట్టారు.

పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు,గుండమ్మ కథ, దేవత, ఇలా ఎన్నో సినిమాలు ఎన్టీఆర్, సావిత్రి కల్సి నటించి హిట్ ఫెయిర్ గా నిలిచారు. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం వంటి సినిమాల్లో వాళ్లే వదిన, మరిదిగా కనిపించి మెప్పించారు.

అలాగే అక్కినేని నాగేశ్వరరావు ,జమున కాంబినేషన్ కూడా అప్పట్లో హిట్ ఫెయిర్ అయింది. మిస్సమ్మ, పెళ్ళినాటి ప్రమాణాలు, ఇల్లరికం, గుండమ్మ కథ, మూగమనసులు, మూగనోము, వంటి సినిమాల్లో ఈ జంట కనువిందు చేసింది. శోభన్ బాబు , వాణిశ్రీ జంటగా వచ్చిన సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. బంగారు పంజరం, చెల్లెలి కాపురం, గంగమంగ, జీవనజ్యోతి, జీవనతరంగాలు వంటి సినిమాల్లో వీరి నటన సూపర్భ్.

చిరంజీవి, రాధ జంట వెండితెరపై కనిపిస్తే స్టెప్పులు అదిరిపోయాయి. నాతొ పోటీగా రాధ స్టెప్పులు వేస్తుందని చిరంజీవి ఒక సందర్భంలో చెప్పారు. దొంగ, అడవి దొంగ, గుండా, రాక్షసుడు, కొండవీటి రాజా, యముడికి మొగుడు, కొండవీటి దొంగ ఇలా 25సినిమాల వరకూ కల్సి నటించారు.

ఇక 1980దశకంలో కుర్రకారుని ఆకట్టుకున్న జంట బాలయ్య, విజయశాంతి. కథానాయకుడు, పట్టాభిషేకం, ముద్దుల క్రిష్నయ్య, సాహస సామ్రాట్, భార్గవ రాముడు, భానుమతి గారి మొగుడు, లారీ డ్రైవర్ ఇలా చాలా సినిమాల్లో నటించి హిట్ జంటగా నిలిచారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."