Healthhealth tips in telugu

1 గ్లాసు తాగితే ఎటువంటి డైట్ లేకుండా చాలా సులువుగా నెలలో 5 కేజీల బరువు తగ్గుతారు

Bay Leaf Weight Loss Tips In telugu : ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు సమస్య అనేది మనలో చాలా మందిని వేధిస్తోంది. బరువు తగ్గించుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవటంతో నిరాశకు గురి అవుతారు. .అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.
Bay Leaf diabetes
మంచి పోషకాహారం తీసుకుంటూ రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి ఒక బిర్యానీ ఆకును చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. పెద్ద ఆకు అయితే ఒకటి తీసుకోవాలి. చిన్న ఆకు అయితే రెండు తీసుకోవాలి.
Weight Loss Drink In Telugu Dalchina Chekka
బిర్యానీ ఆకులో ఉండే లక్షణాలు శరీరంలో పెరుకుపోయిన విషాలను బయటకు పంపడమే కాకుండా జీర్ణక్రియను మెరుగు పరిచి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి. దాల్చిన చెక్క శరీరంలో కొవ్వు కరిగించటానికి చాలా బాగా సహాయపడుతుంది.
cumin seeds
ఇక ఆ తర్వాత అరస్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చివరగా రెండు యాలకులను వేసుకొని 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. ఈ నీటిలో కావాలంటే నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవచ్చు…లేదంటే నిమ్మరసం, తేనె లేకుండా కూడా తాగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి.
Honey benefits in telugu
ఈ డ్రింక్ ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉదయం సమయంలో కుదరని వారు సాయంత్రం సమయంలోనైనా తీసుకోవచ్చు. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ విధంగా తీసుకోవడం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.