Healthhealth tips in telugu

100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేసే శక్తి ఉన్న ఈ పండు గురించి తెలుసా ?

Noni Fruit Benefits : తొగరు ఫలంను ఎప్పుడైనా చూసారా…ఈ పండు గురించి విన్నారా…అయితే ఇప్పుడు ఈ పండు గురించి తెలుసుకుందాం. తొగరు ఫలం గురించి చాలా మందికి తెలియదు. అయితే దీనికి సంబంధించి ఆకులు, కాండం, పండ్ల జ్యూస్ అన్నీ ఔషధంగా ఉపయోగించబడతాయి. ఈ పండు 100 కు పైగా వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంది.
Noni Juice benefits
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తొగరు జ్యూస్‌లో యాంటీ-ఒబేసిటీ లక్షణాలు ఉండుట వలన అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. తొగరు ఫలంలో బీటా-గ్లూకాన్స్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉండుట వలన ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది.
Weight Loss tips in telugu
తొగరు కాయను నోని ఫ్రూట్ అని అంటారు. తొగరు చెట్టు ఏ నేలలోనైనా ఎదుగుంది. సంవత్సర పొడవునా ఫలాలను ఇస్తుంది. ఇవి రుచికి వగరుగా, చేదుగా ఉంటాయి. ఈ చెట్టు ఆకులు కీళ్ళ నొప్పులను నయం చేయటంలో సహాయపడతాయి. ఈ పండులో దాదాపు 150 కి పైగా పోషకాలు ఉన్నాయని నిపుణులు చెప్పుతున్నారు.
kidney problems
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తొగరు జ్యూస్ తాగకూడదు. హై బీపీ సమస్యతో మెడిసిన్ తీసుకునే వారు వీటికి దూరంగా ఉండటం మంచిది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు నోని రసం సేవించడం ప్రమాదకరం. ఒకవేళ తీసుకోవలసిన అవసరం వస్తే కనుక డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.