Healthhealth tips in telugu

నత్తిని తగ్గించి, జ్ఞాపక శక్తిని పెంచటమే కాకుండా మెదడు నరాల బలహీనతను తగ్గించే ఆకు

saraswati Plant : మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అటువంటి మొక్కలలో స‌ర‌స్వ‌తి మొక్క కూడా ఒక‌టి. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువ‌గా వాడుతారు. ఈ మొక్క ఆకులను ప‌లు ఆయుర్వేద మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. నత్తిని తగ్గించి, జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే ఔషధ గుణాలు సమృద్దిగా ఉన్నాయి.
saraswati Plant
చిన్న పిల్లలు సరిగా మాట్లాడలేక పోయినా, బుద్ది బలం లేకపోయినా వారికి ఈ ఆకుల పొడిని లేదా లేహ్యన్ని ఇస్తే చక్కటి ఫలితాలు కలుగు తాయని ఆయుర్వేద నిపుణులు చెప్పుతున్నారు. సరస్వతి ఆకులను మెమరీ బూస్టర్ గా చెప్పుతారు. మూడు సరస్వతి ఆకులను తింటే మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాప‌క‌శక్తి పెరుగుతుంది.

సరస్వతి మొక్క‌ ఆకులను నీడలో ఎండబెట్టాలి. ఎండిన ఆకులు,5 బాదంపప్పులు, 2 మిరియాలు, వేడి నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని మెత్తని వస్త్రంలో వేసి వడకట్టాలి. ఈ రసంలో తేనె కలిపి 40 రోజుల పాటు తీసుకుంటూ ఉంటే మాటలు సరిగ్గా రాని పిల్లలకు మాటలు వస్తాయి. అలాగే నత్తిని తగ్గించే శక్తి కూడా దీనికి ఉంటుంది.
Diabetes patients eat almonds In Telugu
ఇలా తీసుకోవటం వలన మెదడు నరాలు బలంగా ఉండటమే కాకుండా మెదడుకి సంబంధించిన అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఇది మెదడునే కాదు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. అయితే ఇటువంటి ఆకులను వాడే ముందు ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకొని వాడితే మంచిది. నిపుణులు అయితే సరైన మోతాదు చెప్పుతారు. ఇది ఒక అవగాహన కోసం మాత్రమే.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.